హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: కల్తీ సారా మరణాలు నిజం కాదా..? బాబాయ్ గుండు పోటు ఫేక్ కాదా? సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు

Nara Lokesh: కల్తీ సారా మరణాలు నిజం కాదా..? బాబాయ్ గుండు పోటు ఫేక్ కాదా? సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు

Nara Lokesh: సీఎం జగన్ పై నారా లోకేష్ సైటర్లు ఆగడం లేదు.. ఇటు మీడియా సమావేశాల్లో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నఆయన.. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే ఓ రేంజ్ లో పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. తాజా ఏది ఫేక్.. ఏది వాస్తవం అంటూ జగన్ పై మరోసారి ఓ రేంజ్ లో విమర్శలు చేశారు లోకేష్.

ఇంకా చదవండి ...

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.. రోజు రోజుకూ మరింత ముదురుతోంది. ముఖ్యంగా జంగారెడ్డి గూడెం (Jangareddy Gudem) ఆకస్మిక మరణాలపై.. వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అక్కడి మరణాలు అన్నీ సహజ మరణాలే అని వైసీపీ ప్రభుత్వం చెబుతూంటే.. కాదు ప్రభుత్వ హత్యలే అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశం గత కొన్ని రోజుల నుంచి అసెంబ్లీని కుదిపేస్తోంది. శాసన సభలోనూ, శాసన మండలిలోనూ ఇరు పక్షాల మధ్య ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. వరుసగా మరోరోజు ఇదే అంశంపై చర్చ జరపాలని టీడీపీ పట్టు పట్టడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన, సస్పెన్షన్ ల నేపధ్యంలో కల్తీ సారా మరణాలపై తెలుగుదేశం పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. గ్రామస్థాయిలో రాష్ట్రంలో కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆందోళన కొనసాగిస్తోంది. ఇదే అంశంపై మంగళవారం సైతం అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ నేతల సస్పెన్షన్ కొనసాగింది.

  ఇదీ చదవండి : ఎంపీపై పరువు నష్టం దావా..! ఆయన తీరుపై ఏపీ సర్కార్ సీరియస్.. యాక్షన్ ప్లాన్ రెడీ

  ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీలోనే కాదు.. బయట కూడా పోరాడుతోంది. తజాగ పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాయి. పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన చేపట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై పోరాటన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. తాజాగా మంగళవారం నాడు శాసనమండలిలో కల్తీసారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై బ్రాండ్ మద్యం అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. టీటీడీతో పాటు మరికొన్ని బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ ఆర్డర్‌లో లేకుండా బిల్లులు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బిల్లు ప్రతులను టీడీపీ ఎమ్మెల్సీలు చించివేశారు. దీంతో చాలా సేపు సభలో గందరగోళం ఏర్పడింది.

  ఇదీ చదవండి : ఇటు నుంచి జూనియర్ ఎన్టీఆర్.. అటు నుంచి రామ్ చరణ్.. టీకప్ లతో క్రేజీ చిత్రం.. ఎన్ని కప్పులు వాడాడో తెలుసా?

  ఇదిలా ఉంటే జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ఎమ్మెల్సీలను ఉపముఖ్యమంత్రి తిడుతుంటే జగన్ నవ్వుతూ చూస్తారా అంటూ ప్రశ్నించారు. సభలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై చర్చ వద్దంటే ఇంకా దేనిపై చర్చలు జరుపుతారని లోకేష్ ప్రశ్నించారు. కల్తీ సారా వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని లోకేష్ విమర్శించారు. సభలో చర్చ జరిగితే అన్ని బయటకు వస్తాయని తమని దూషించి, సభ నుంచి జగన్ పారిపోతున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు.

  ఇదీ చదవండి : మూడు రాజధానాలకు బిల్లు రెడీ అయ్యిందా..? అసెంబ్లీ ముందుకు వచ్చేది ఎప్పుడు? బొత్స ఏమన్నారంటే?

  ఇక సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్లో లోకేష్ పోస్టులు చేశారు. సీఎం జగన్ బాబాయ్ గుండెపోటు ఫేక్, కల్తీ సారా మరణాలు నిజమంటూ నిరసన తెలిపామన్నారు. సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాస‌న‌మండ‌లిలో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి ఛైర్మన్ కి లేఖ రాసామని లోకేష్ ప్రకటించారు. తమను ప్రభుత్వం తిట్టినా.. అక్రమ కేసులు పెట్టి బెదిరించినా.. తాము మాత్రం కల్తీసారాపై యుద్ధం ఆపేది లేదని లోకేష్ తేల్చి చెప్పేశారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh, TDP, Ycp

  ఉత్తమ కథలు