ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు జీర్ణించుకునే లోపే పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీని కలవరపెట్టాయి. తాజా కార్పొరేష్ ,మున్సిపాలిటీ ఎన్నికలు ఫలితాలు ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పునాదులను కుదిపేస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ముఖ్యమైన మున్సిపాలిటీలు, విజయవాడ, గుంటూరు, కుప్పం, హిందూపూర్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినా ఫలితాలు మాత్రం పార్టీకి అనుకూలంగా రాలేదు. ఒక్క తాడిపత్రిలో తప్పించి తెలుగు తమ్ముళ్లు ఎక్కడా సక్సెస్ కాలేకపోయారు. గతంలో ఎన్నడూ రాని ఈ ఫలితాలను చూసి పార్టీ నేతలతోపాటు చంద్రబాబు కూడా షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కేడర్ లో అభద్రత భావన్ని పోగొట్టడానికి బాబు మళ్లీ రంగంలో దిగారు.
సోమవారం పార్టీ ముఖ్య నేతలతోపాటు, కేడర్ తో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి ఘోర ఫలితాలు రావడానికి కారణాలపై చర్చించారు. ఈ సమవేశంలో గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహారించిన తీరు ఇప్పుడు కేడర్ గ్రౌండ్ లెవల్ లో పని చేయకపోవడానికి కారణమని క్రింది స్థాయి కేడర్ బాబు ముందు విన్నవిచ్చుకున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఇలాంటి ఫలితాలు రావడానికి కారణమని బాబు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను ఎన్ని సార్లు బాబు ముందు పెట్టిన చూసి చూడనట్లు వ్యవహారించారని ఇప్పుడు చేజారిపోయక ప్రయోజనం లేదని కార్యకర్తలు బాబుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు తిరుపతి అభ్యర్ధి ఎంపికపై బిజేపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణుల కాస్త టెన్షన్ పడ్డాయి. ప్రస్తుతం వస్తోన్న ఫలితాల నేపథ్యంలో తిరుపతి రెండో స్థానంలో నిలవడం కూడా కష్టమవుతుందని భావించాయి. అయితే పోటీలో జనసేన లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. తిరుపతిలో అధికారపార్టికి గట్టి పోటి ఇవ్వడం ఖాయమని భావిస్తున్నాయి టీడీపీ శ్రేణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Municipal Elections