AP POLITICS TDP LEADER YANAMALA RAMA KRISHNUDU MADE SENSATIONAL COMMENTS ON YS JAGAN LONDON TOUR FULL DETAILS HERE PRN
YS Jagan: జగన్ లండన్ టూర్ సీక్రెట్ అదే..! టీడీపీ నేత సంచలన ఆరోపణలు
జగన్ లండన్ టూర్ పై వివాదం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (YS Jagan) దావోస్ (Davos-2022) పర్యటన ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతోంది. జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్ లో ల్యాండ్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు మండిపడతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (YS Jagan) దావోస్ (Davos-2022) పర్యటన ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతోంది. జగన్ ముందుగా చెప్పినట్లు నేరుగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ వెళ్లకుండా లండన్ లో ల్యాండ్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు మండిపడతున్నారు. సీక్రెట్ గా లండన్ వెళ్లడంపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా లండనం వెళ్లిందంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మూడే ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? చెప్పాలన్నారు యనమల. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు.
“అధికారులను వదిలేసి లండన్ ముగ్గురే వెళ్లడం లోగుట్టు ఏమిటి..?, మీ సొంత పనులకు, సీక్రెట్ పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..? ఏ దేశ పర్యటనకు సిబిఐ కోర్టును అనుమతి కోరారు..ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది..? లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఉందా..? దావోస్ కు వెళ్లడానికి మాత్రమే అనుమతించిందా..? 14కేసులలో ముద్దాయిగా వున్న ఏ1 నిందితుడైన చరిత్ర జగన్ ది. ఆయన గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమే. ఏ దేశం వెళ్లడానికి మీరు దరఖాస్తు చేశారు..? మీకు ఏ దేశానికి అనుమతి ఇచ్చారు, మీరు ఏ దేశానికి వెళ్లారు..? లండన్ కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదు..? షెడ్యూల్ లో లేని లండన్ లో ఎందుకు ల్యాండ్ అయ్యారు..? అనుమతి ఇవ్వకపోయినా లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కాదా..? Permitting petitioner/A1 to visit Switzerland for the period from 19.05.2002 to 31.05.2022 to attend World Economic Forum Annual Meeting అని సిబిఐ కోర్టు ఆదేశాల్లో ఉన్నది వాస్తవం కాదా..?” అని యనమల తన ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బైటపెట్టాలన్న యనమల.. వైసీపీ మూడేఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.., దాడులు-దౌర్జన్యాలు, తప్పుడు కేసులు-అక్రమ నిర్బంధాలు, భూదందాలు-దోపిడీ పాలనపై ఆగ్రహావేశంతో ఉన్నారన్నారు. బిసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీ సహా అన్నివర్గాలు విసిగిపోయాయరని విమర్శించారు. జగన్ లండన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలన్నారు. అధికారిక పర్యటనల్లో పారదర్శకత పాటించాలని యనమల అన్నారు. జవాబుదారీగా ఉండాలి.. ప్రజల అనుమానాలు నివృతి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని యనమల డిమాండ్ చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.