Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER VARLA RAMAIAH COMPLIANT ON AP CM YS JAGAN TO CALL CENTER AK

కాల్ సెంటర్‌కు టీడీపీ నేత ఫోన్... జగన్‌పై ఫిర్యాదు

అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ (File Photo)

అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ (File Photo)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య... ఏపీ సీఎం జగన్‌పై ఫిర్యాదు చేశారు.

    అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు అవినీతికి సంబంధించిన ఈ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాజాగా ఈ కాల్ సెంటర్‌కు ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య కాల్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని వర్ల రామయ్య కాల్ సెంటర్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది టీడీపీ నేత వర్ల రామయ్యకు సూచించారు. సీఎం జగన్ ప్రకటించినట్లుగా తాను ఇచ్చిన ఫిర్యాదుపై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 43 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అభియోగాలు పెట్టుకుని అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Tdp, Varla ramaiah, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు