Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKSH COMMENTS ON RRR MOVIE HE WISS JR NTR AND RAMCHARAN NGS

Nara Lokesh on RRR: ఆర్ఆర్ఆర్ మూవీపై నారా లోకేష్ కామెంట్.. ఏమన్నారంటే..?

ఆర్ఆర్ఆర్ మూవీపై నారా లోకేష్ కామెంట్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ మూవీపై నారా లోకేష్ కామెంట్ (Twitter/Photo)

Nara Lokesh on RRR Movie: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం కేవలం నందమూరి, మెగా అభిమానులే కాదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా నారా లోకేష్ ఆర్ఆర్ఆర్ పై కామెంట్ చేశారు.

ఇంకా చదవండి ...
    Nara Lokesh on RRR Moive:  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంచనాలకు తగ్గట్టే తొలి రోజే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజు టికెట్ ధర ఎంతైనా.. అభిమానులు తగ్గేదేలే అంటూ.. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కేవలం నందమూరి (Nanadamuri), మెగా (Mega) అభిమానులు (Fance)  .. ఇతర హీరోల అభిమానులే కాదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు నుంచే థియేటర్లకు జనం పోటెత్తారు. సినిమా హాళ్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ హంగామా కనిపిస్తోంది.  జూ. ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ramcharan) హీరోలుగా రూపొందిన ఈ సినిమాతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకరేంటి రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా కోసం చర్చించుకుంటున్నారు. అవకాశం ఉన్నవారంతా తొలి రోజే సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమా పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కామెంట్ చేశారు..

    ప్రస్తుతానికి ఇంకా సినిమా చూడకపోయినా నారా లోకేష్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు గుడ్ లెక్ చెబుతూ కామెంట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి ఓపెనింగ్ రివ్యూస్ వస్తున్నాయని.. తారక్, రామ్ చరణ్‌, రాజమౌళిలకు అభినందనలు తెలిపారు. సినిమా యూనిట్‌ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారంలోనే తాను కూడా కుటుంబ సమేతంగా మూవీని కచ్చితంగా చూస్తానన్నారు.






    RRR మూవీ సినిమా రిలీజ్ అయిన కాసేపటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు బయటకు వచ్చేశాయి. ప్రస్తుతం విడుదలైన అన్నిచోట్లా సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేస్తూ తమ హీరోలపై అభిమానాన్ని చాటుకుంటున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరోవైపు కళాకారులు సైతం ట్రిపుల్ R సినిమాపై అనేక కళాఖండాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కళాకారుడు 12 వేల టీ కప్పులతో రామ్ చరణ్, ఎన్టీఆర్ రూపాల్ని ఆవిష్కరించరు.

    ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఎవరికి వారు తమ అభిమానాన్ని చూపించుకుంటున్నారు. సినిమా స్టార్లు, రాజకీయ నేతలు సైతం ఈ సినిమా కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరి ఎదురు చూపులు ఫలించి... సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, RRR, TDP

    తదుపరి వార్తలు