Lokesh Letter: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. ఆ లేఖలో సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు. అంతే కాదు ఆయనను చూసి.. ఏపీ సీఎం జగన్ నేర్చుకోవాలని లేఖలో రాశారు. ఆ లేఖలో ఆయన ఏం రాశారంటే.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్న విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు. వారి విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని లేఖలో కోరారు. యుద్ద వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్‌లో (Ukraine) చదువుతున్న అక్కడ ఉన్నతెలుగు విద్యార్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చేరుకున్నారన్న లోకేశ్.. వచ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులు (Online Classes) ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
కొంతమంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తాము చదివే వర్సిటీ నుంచి ఎటువంటి సమాచారం లేక వారంతా అయోమయంలో వున్నారని.. అలాంటి వారి కోసం వారి కోర్సులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ సీఎం @ysjagan గారికి లేఖ రాసాను. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు.(1/3) pic.twitter.com/JlspOr2bsa
— Lokesh Nara (@naralokesh) March 16, 2022
ప్రస్తుతం ఏపీకి పొరుగున ఉన్నతమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్ నుంచి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. అంతేకాదని వారికి ఆర్థికంగా అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకటించాయని వివరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చదువు పూర్తయ్యే బాధ్యతను తీసుకోవాలని లోకేస్ కోరారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉక్రెయిన్ నుంచి రాస్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఎంబిబిఎస్ అభ్యసించేందుకు అవసరమైన ఖర్చులను తమ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: బ్రదర్ రాజకీయ అవతారం ఎప్పుడు..? స్వీట్ వార్నింగ్ ఇస్తున్న క్రిస్టియన్ జేఏసీ
ఉక్రెయిన్ లో వైద్య విద్యను చదివేందుకు మన దేశం నుంచి సుమారు 20 వేల మంది యువతీ యువకులు వెళ్లారని ఆయన అన్నారు. మన దేశంలో వైద్య విద్య చదవడానికి కోటి రూపాయాలు ఖర్చు పెట్టాల్సి వస్తే.. ఉక్రెయిన్ లో మాత్రం 25 నుంచి రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి అవుతుందన్నారు. ఇలా స్వదేశంలో వైద్యవిద్య చదివే అవకాశం లేక ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో తిరిగి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి ఇప్పటికే 740 మంది వైద్య విద్యార్ధులు తిరిగి వచ్చారని లోకేష్ అన్నారు. వీరు తమ వైద్య విద్యను కొనసాగించుకునేందుకు వీలుగా అవసరమయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.