Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH WROTE A LETTER TO CM JAGAN MOHAN REDDY ON POOR PEOPLE FUTURE NGS GNT

Nara Lokesh: పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తారా..? సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

స్లైల్ మార్చిన నారా లోకేష్

స్లైల్ మార్చిన నారా లోకేష్

Nara Lokesh: విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమస్యపైనా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం జగన్ కు నేరుగా లేఖ రాశారు. ఆయన లేఖలో ఏం పేర్కొన్నారంటే..?

    Nara Lokesh: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా.. తాను ఉన్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. కరోనా సమయం నుంచి అన్ని విషయాల్లోనూ విద్యార్థుల సమస్యలను ఆయనే నేరుగా ప్రశ్నిస్తున్నారు. మొదట కరోనా వైరస్ (Corona Virus) సమయంలో పరీక్షల రద్దు విషయంపై లోకేష్ పోరాడారు. అప్పటి నుంచి ప్రతి విషయంలో ఆయన విద్యార్థులకు అండగా..? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. తాజాగా సీఎం జగన్ (CM Jagan) కు మరోసారి ఘాటుగా లేఖ రాశారు. పేద‌ పిల్లల‌కు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని లేఖలో కోరారు. జాతీయ విద్యావిధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్లల‌కు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ‌శాల‌ల ప్రారంభం రోజునే ల‌క్షలాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు ప్రభుత్వ నిర్ణయం శ‌రాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగ‌మేఘాల‌పై జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోందని అభిప్రాయపడ్డారు.

    విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. తీసుకున్నపాఠశాల‌ల విలీన నిర్ణయం మూలిగే న‌క్కపై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైందన్నారు. అలాగే జాతీయ విద్యా విధానం అమ‌లును ఇంకా ఏ రాష్ట్రం మొదలు పెట్టకుండానే ఏపీలో ప్రారంభించేశారని.. స‌మ‌స్యల‌పై ఎలాంటి అధ్యయ‌నం లేకుండా మ‌న‌ రాష్ట్రంలో ఆరంభించ‌డంతో బ‌డికి దూర‌మైన విద్యార్థులు రోడ్డున ప‌డ‌టం చూశామని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.



    ఎన్ఈపీ సూచ‌న‌ల మేర‌కు క‌రిక్యులమ్, బోధ‌నా విధానాలు అమ‌లు కోస‌మే పాఠ‌శాల విద్యను నాలుగు స్థాయిలుగా విభ‌జించారన్నారు. కానీ పాఠ‌శాల‌ల‌ను విభ‌జించాల్సిన అవ‌స‌రంలేద‌ని కేంద్రం స్పష్టం చేసినా ప‌ట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శలు చేశారు. పాఠ‌శాల‌ల‌ను విభ‌జించ‌డంతో స‌మ‌స్య తీవ్రమైందని.. జాతీయ విద్యావిధానం అమ‌లు చేసే తొంద‌ర కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ను త‌గ్గించే ఆతృత ప్రభుత్వంలో క‌నిపిస్తోందని ఆయన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : వైసీపీ ప్లీనరీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ.. సమావేశాల షెడ్యూల్ ఇదే..

    ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన‌ 117 జీవో అమ‌లు వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్దీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్రభుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.  చదువకునేందుకు ఇంటికి ద‌గ్గర‌లో ఉన్న బ‌డినే తీసేస్తే.. పేదవారిని చ‌దువుకు దూరం చేయ‌డ‌మే అవుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. 2 కిలోమీటర్ల పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూళ్లలోనూ కలపడంతో ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందని గుర్తు చేశారు. అలాగే చాలా స్కూల్స్ లో . హెడ్‌మాస్టర్, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించ‌ని కారణంగా విద్యార్థుల శారీరక మాన‌సిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందన్నారు లోకేష్.

    ఇదీ చదవండి : పేరెంట్స్‌ బీ అలర్ట్.. వానాకాలం వచ్చేసింది.. పిల్లల ఆరోగ్యం గురించి ఇలా చేయండి..

    పిల్లల‌కి పాఠ‌శాల‌లు ఒక కిలోమీట‌రు దూరంలోపే ఉండాల‌ని విద్యావిధానాలు చెబుతుంటే ప్రభుత్వం ఏకంగా 3 కిలోమీట‌ర్ల దూరానికి పాఠ‌శాల‌లు త‌ర‌లించ‌డం ప్రభుత్వ విద్యను పేద‌ల‌కి దూరం చేయ‌డ‌మేనని లోకేష్ ఆరోపించారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేష‌న‌లైజేష‌న్ పేరుతో నియంతృత్వ పోక‌డ‌ల‌తో అమ‌లు చేస్తోన్న ఈ విద్యావిధానం వ‌ల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్యత్తులో 11 వేల‌కు త‌గ్గిపోతాయన్నారు. రేష‌న‌లైజేష‌న్ విధానం కారణంగా మొత్తం 55 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావ‌డం విద్యా వ్యవ‌స్థకే మ‌ర‌ణ‌ శాస‌నం లాంటిదన్నారు. అలాగే మ‌రో ప‌దేళ్లపాటు డీఎస్సీ కూడా వేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో టీచ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటున్న ల‌క్షలాది మంది ఆశ‌లు ఆవిరి చేయ‌డం దారుణమని లోకేష్ విమర్శలు చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

    తదుపరి వార్తలు