Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH WILL START HIS PADAYATRA FROM NOVERMBER MOTH TILL ELECTIONS NGS

Nara Lokesh: నవంబర్ నుంచి నారా లోకేష్ పాదయాత్ర..? 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు రూట్ మ్యాప్

స్లైల్ మార్చిన నారా లోకేష్

స్లైల్ మార్చిన నారా లోకేష్

Nara Lokesh: ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఎక్కడైతో ముగించారో.. అక్కడ నుంచే లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుడతారా..? లోకేష్ పాద యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారా..?

    Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Prsesh) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. దీనికి తోడు సర్వేలు హోరెత్తిస్తున్నాయి.  బయట సర్వేలు.. అంతర్గత సర్వేలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ..  ప్రత్యేక వ్యూహాలతో వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. విపక్షాలు అయితే ముందస్తు ఫిక్స్ అనే భావనలో ఉన్నాయి. అందుకే దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam).. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఆ మధ్య మహానాడు (Mahanadu) సక్సెస్ అవ్వడం.. అధినేత చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) చేపట్టిన బాదుడే బాదుడుకు అనూహ్య స్పందన రావడంతో.. దూకుడు పెంచుతోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ప్రస్తుత సీఎం.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముగించిన చోటు నుంచే లోకేష్ పాద యాత్ర ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  

    గత ఎన్నికల్లో ఘోరగా ఓటమి తరువాత.. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే  లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అయితే నూతన ఉత్తేజంతో ఉన్న ఆ పార్టీ ఏ క్ష‌ణ‌మైనా రాష్ట్రంలో ఎన్నిక‌లు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా శ్రేణులను సిద్ధం చేసేందుకు లోకేష్ సై అంటున్నారు. ఇటీవల చేపట్టిన కార్యక్రమాలతో పార్టీకి వస్తున్న స్పందనను ప్రజల్లో ఇలాగే కొనసాగించేలా చేయాలంటే పాదయాత్ర లాంటి కార్యక్రమం అవసరమని పార్టీ అధిష్టానం భావించడంతో పాదయాత్రకు సిద్ధమయ్యారు లోకేష్..



    మొదట ఆగస్టు నుంచే ప్రారంభించాలనుకున్నప్పటికీ నవంబరు నుంచి జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మన ప్ర‌భుత్వం పేరుతో కార్యక్రమం కొనసాగిస్తోంది. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు జనసేనాని విజయదశమికి బస్సు యాత్ర ప్రారంభించేందుకు అన్నిరకాలుగా సన్నద్ధమవుతున్నారు. దీంతో తెలుగు దేశం సైతం పోటీగా పాదయాత్రకు సిద్ధమైంది. ఈ పాదయాత్రను ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి : పేపర్ బాయ్ గా మారిన ఎమ్మెల్యే.. ఇంటింటికీ సైకిల్ పై వెళ్తూ పేపర్ డెలివరీ

    ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ఏడాది ముందుకానీ, ఆరు నెలల ముందుకానీ ముందస్తు రావచ్చనే అంచనాతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఉన్నాయి. నాయకులు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్తేజం నింపేందుకు లోకేష్ పాద‌యాత్ర‌ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. పాదయాత్ర ఎక్క‌డి నుంచి ప్రారంభించాలి? రోజుకు ఎన్ని కిలోమీట‌ర్లు న‌డ‌వాలి? లాంటి ప్ర‌తిపాద‌న‌ల‌న్నీఇప్పటికే సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ఈ యాత్ర ఉండబోతోందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌య వ‌ర్గాలు చెబుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు