హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం జగన్ ఢీల్లీ పర్యటనకు కారణం ఇదే.. వైరల్ అవుతున్న ట్విటర్ పోల్.. మీ అప్షన్ ఏంటి అంటూ ప్రశ్న

CM Jagan: సీఎం జగన్ ఢీల్లీ పర్యటనకు కారణం ఇదే.. వైరల్ అవుతున్న ట్విటర్ పోల్.. మీ అప్షన్ ఏంటి అంటూ ప్రశ్న

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు కారణం ఏంటి..? రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చిస్తారని. పోలవరం ప్రాజెక్టుపై చర్చిస్తారని.. రాజకీయ పరస్థితులు వివరిస్తారని.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సహాయంపై హామీ ఇస్తారని.. ఇలా వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు కారణం ఇదే అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన.. మొదట ప్రధాని మోదీ (Prime Minster Modi) తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఆ తరువాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Seetaram), ఆ తరువాత హోమంత్రి అమిత్ షా (Amit shah) తో సహా, పలువురు మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. అయితే ఆయన పర్యనకు కారణం ఇదే అని అధికారికంగా వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆయన పర్యటనకు కారణం ఇదే అంటూ ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  (Nara Lokesh) సెటైర్లు వేస్తూ.. ఓ ట్వీట్ చేశారు. అందులో పలు ప్రశ్నలు సంధించారు. పైన క్వశ్చన్ అడుగుతూ.. అందుకు నాలు ఆప్షన్లతో ట్విట్టర్‌లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోల్ హాట్ టాపిక్ అవుతోంది.

ఈ పోల్‌లో తొలి అంశంగా బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకా అని పెట్టారు. ఇక రెండోదిగా తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన 48 వేల కోట్ల రూపాయల వ్యవహారాన్ని కామప్ చేయాలనా..? మూడోదిగా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలి కోరడానికా..? ఇక చవరిదిగా లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలనా? అంటూ నారా లోకేష్ నిలదీశారు. ఈ నాలుగింటిలో దేని కోసం జగన్ ఢిల్లీ వెళ్లారో చెప్పాలని నెటిజన్‌లను నారా లోకేష్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.


ఆయన ట్వీట్ ఎలా ఉన్నా.. ఇప్పటికే సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధానితో కూడా భేటీ అయ్యారు.

ఇదీ చదవండి : మరోసారి మనసు టచ్ చేసిన సీఎం.. కాన్వాయ్ మధ్యలో 108కు దారిచ్చిన జగన్

ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నికలపై ఎలా వ్యవహరిస్తారన్నదానిపై ప్రధానికి హమీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏపీలో పెరుగుతున్న అప్పుల విషయంలోనూ ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవలే బ్యూరోక్రట్లు ఈ విషయంలోపై ప్రధానిని హెచ్చరించారు. ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో అప్పులు పెరిగిపోయాయని.. శ్రీలంకలో పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఉత్కంఠ పెంచుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh

ఉత్తమ కథలు