Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH SLAMS YS JAGAN AND YSRCP OVER PEGASUS ALLEGATIONS FULL DETAILS HERE PRN GNT

Lokesh on Pegasus: పెగాసస్ విషయంలో దేనికైనా రెడీ.. ఏపీ ప్రభుత్వానికి లోకేష్ సవాల్..

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

పెగాసస్ వ్యవహారం (Pegasus Issue) ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా.. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) వివాదాస్పద సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.

    పెగాసస్ వ్యవహారం (Pegasus Issue) ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా.. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) వివాదాస్పద సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెగాసస్ వ్యవహారంలో మేం దేనికేనా రెడీ అని ఆయన ఛాలెంజ్ చేశారు. పెగాసెస్ పై హౌస్ కమిటీ.. జూడీషీయరీ కమిటీ, సీబీఐ విచారణ తాము దేనికేనా సిద్ధమంటూ ప్రకటించారు. బాబాయ్ హత్య విషయంలోనూ.. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాల విషయంలోనూ విచారణకు సీఎం జగన్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు.

    మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదని.. మమతా బెనర్జీ బెంగాలీలో మాట్లాడిన వీడియోలో అసలు చంద్రబాబు ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన నా స్నేహితుడు చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు మాకెవరికీ లేదన్న.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందేమో అన్నారు. అందుకే అంబటి రాసలీలలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: వైసీపీ నేతలతో పేకాట.. బాలకృష్ణ పీఏ అరెస్ట్..


    ఐదు రోజులుగా మద్యం.. కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నామని.. సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమని లోకేష్ అన్నారు. ప.గో జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయార్న్న లోకేష్.. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని విమర్శించారు. ఒక సామాజిక కార్యకర్త చేయించిన డీప్ కెమికల్ అనాలిసిస్ లో జే బ్రాండ్ల లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు తేలిందని.., త్వరలోనే ఆ రిపోర్టులు బయట పెడతామని హెచ్చరించారు.

    ఇది చదవండి: ఉక్రెయిన్ విద్యార్థులపై జగన్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో సాయం చేస్తామన్న సీఎం


    కల్తీ సారాతో.. కల్తీ మద్యంతో పేదలను ఈ ప్రభుత్వం చంపేస్తోందని.. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..? అని లోకేష్ ప్రశ్నించారు. మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై సభలో చర్చకు పెట్టారన్న లోకేష్.. మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్ పై చర్చ పెట్టారని విమర్శించారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు రిప్లై ఇచ్చారని.., వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని లోకేష్ స్పష్టం చేశారు. మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు ఛైర్మన్ అనుమతించలేదన్న ఆయన.. తప్పుడు సమాచారంతో సభలో చర్చకు పెట్టారని విమర్శించారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారంటున్న వైసీపీకి భవిష్యత్తులో 15 మంది ఉండని పరిస్థితి వస్తుందని లోకేష్ ఎద్దేవా చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు