పల్నాడు ఇష్యూతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ (TDP) కార్యకర్త జల్లయ్య హత్య వ్యవహారం తర్వాత వైసీపీ (YSRCP) ని టీడీపీ మరింత టార్గెట్ చేస్తోంది. పల్నాడులో ఇప్పటికి ఐదుగురు టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పిన్నెల్లి హత్య చేయించారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Loksesh) సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు బాలయ్య బాబు స్టైల్లో డైలాగులు పేల్చారు. అక్రమకేసులతో, దాడులతో టిడిపిని భయపెట్టాలని సీఎం జగన్ (AP CM YS Jagan) చూస్తున్నారని.. భయం తెలుగుదేశం పార్టీ బయోడేటాలో లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అరాచకాల్ని, అవినీతిని ప్రశ్నిస్తే టిడిపిపై దాడులకి పాల్పడుతున్నారని.., అన్ని అనుమతులు వున్నా అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చారని., కోర్టుకెళితే చట్టాలని ఉల్లంఘించిన సంగతి బయటపడిందన్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ రాష్ట్రమంతా టిడిపి నేతలపై అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించారన్న లోకేష్.. చివరికి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైకాపా కుక్కలు దాడికి బరితెగించాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. 2019 ముందు తనపై ఒక్క కేసు కూడా లేదని., జగన్ వచ్చాక 14 కేసులు పెట్టించాడన్నారు. వైసీపీ సర్కారు పెట్టే దొంగ కేసులకీ, కార్యకర్తలపై దాడులకి టీడీపీ భయపడదన్నారు. మీ అయ్య కూడా ఇలాగే మమ్మల్ని భయపెట్టాలని అనుకున్నాడని.., కత్తితో బతికితే కత్తితోనే చస్తావు జగన్ అంటూ లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు.
జగన్ శాశ్వతం కాదని.. వ్యవస్థలు శాశ్వతమంటూ అధికారులను హెచ్చరించిన లోకేష్.. జగన్ కోసం అడ్డగోలుగా వ్యవహరించిన అప్పటి డిజిపి గౌతమ్ సవాంగ్ ఎక్కడున్నాడో చూడాలని హితవుపలికారు. జగన్ గౌతమ్ సవాంగ్‌ని వాడి పడేశాడని.., ఎన్టీఆర్ దేవుడు..చంద్రన్న రాముడు...వైసీపీ నేతల పాలిట నేను మూర్ఖుడినని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు వైసీపీ పెద్దల ఆదేశాలతో చట్టాన్ని ఉల్లంఘించి టిడిపిపై దాడిచేసిన ఏ ఒక్కడినీ వదలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఎవ్వరినీ ఏమీ అనలేదని.., మా చంద్రన్న ఆ రోజు చిటికె వేస్తే జగన్ మాఫియా రెడ్డి పాదయాత్ర చేయగలిగేవాడా? అని ప్రశ్నించారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న పిన్నెల్లి ఇంటి పేరు పిల్లిగా మార్చుకోవాలంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఇన్ని అరాచకాలు చేసే నువ్వు ఎక్కడికి పారిపోతావో చూస్తామని.. ఏపీ, ఇండియా లేదా ప్రపంచంలో ఏమూలన దాక్కున్నా లాక్కొస్తామన్నారు. అనంతరం జల్లయ్య కుటుంబానికి రూ.25 లక్షల సాయాన్ని అందించిన లోకేష్.. జల్లయ్య పిల్లల్ని చదవిస్తానని హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP