హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: విశ్వరూపం అంటే ఇదేనా? ప్రశ్నించిన అధికారులపై జేసీబీలతో దాడులు చేయడమా?

Nara Lokesh: విశ్వరూపం అంటే ఇదేనా? ప్రశ్నించిన అధికారులపై జేసీబీలతో దాడులు చేయడమా?

కొడాలి నానిపై లోకేష్ విమర్శలు

కొడాలి నానిపై లోకేష్ విమర్శలు

Nara Lokesh: మాజీ మంత్రి కొడాలి నానిపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.. మంత్రి పదవి పోతే తన విశ్వరూపం చూపిస్తాను అన్నారని.. తప్పును నిలదీస్తున్న అధికారులను జేసీబీలతో తొక్కించడమేనా ఆయన విశ్వ రూపం అంటూ మండిపడ్డారు.. ఇంతకీ ఏం జరిగింది అంటే.?

ఇంకా చదవండి ...

Nara Lokesh:  మాజీ మంత్రి,  వైసీపీ (YCP) కీలక నేత కొడాలి నాని (Kodali Nani) గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఉండడం వల్లే పూర్తిగా మాట్లాడలేకపోతున్నానని.. మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. ఇక తన విశ్వరూపం చూపిస్తాను అంటూ ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ,  నారా లోకేష్ (Nara Lokesh) లను టార్గెట్ చేస్తూ ఆ హెచ్చరికలు చేశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి.. చాలా రోజులైంది కానీ.. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడా వార్తల్లో నిలవలేదు. గతంలో మాదిరి విపక్షాల మీద ఫైర్ కూడా కనిపించడం లేదు. ఇటీవలే పశువుల కొట్టంలో పడుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యింది. మంత్రి పదవి పోవడంతో ఇలా మారారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వస్తోంది. విశ్వరూపం అంటే ఇదేనా అని.. ఓ రెవెన్యూ ఉద్యోగిపై దాడిని చూపిస్తూ నారా లోకేష్ ప్రశ్నించారు..

ఏం జరిగింది అంటే..? కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ‌ (Gudivada) లోని మోటూరు మట్టి మాఫియా ఘటనపై రాజకీయ రగడ మొదలైంది. ఈ ఘటనపై నారా లోకేశ్ మండిపడ్డారు. అధికార పక్ష నేతలు బరితెగించి అధికారులపై దాడులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయిన క్యాసినో స్టార్ కొడాలి నాని అనుచరులే ఆర్ఐ అరవింద్ (RI Arvind) పై దాడులు చేయించారంటూ విమర్శలు చేశారు. ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని.. అతడు మాజీ మంత్రి, కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ (Ganta Suresh) తమ్ముడు గంట కళ్యాణ్ (Ganta Kalyan) అని అన్నారు.


ఇదీ చదవండి : బియ్యం బదులు నగదు పై అనుమానాలు.. కార్డులు రద్దవుతాయా..? మంత్రి ఏమన్నారంటే..?

కొడాలి నాని అండతోనే మట్టి మాఫియా రెచ్చిపోతోందని.. విధుల్లో ఉన్న అధికారులపై కూడా దాడులు చేయించేంతగా అధికార పార్టీ నేతలు బరి తెగించారంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు.. ఇలా దాడులు చేస్తుంటే.. అధికారులు విధుల్లో ఎలా పాల్దొంటారని మండిపడ్డారు. కొడాలి నాని నా విశ్వ రూపం చూపిస్తానంటూ ప్రగల్బాలు పలికారని..విశ్వరూపం చూపించటం అంటే ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడమా అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవి కోల్పోయిన క్యాసినో స్టార్ ఇటువంటి మాఫియాలతో బరి తెగించి వ్యవహరిస్తున్నారంటూ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే మట్టి మాఫియా, గడ్డం గ్యాంగ్ రెచ్చిపోతోందంటూ లోకేస్ ఫైర్ అయ్యారు.

ఇదీ చదవండి : మంత్రి ఫోన్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సినిమా, రాజకీయ ఎంట్రీకి కారణం ఎవరో తెలుసా..?

గుడివాడ‌లో జోరుగా సాగుతున్న అక్ర‌మ మ‌ట్టి త‌ర‌లింపులు జరుగుతున్నాయంటూ అందిన సమాచారంతో ఆర్ఐ అరవింద్ ఘటనాస్థలానికి వెళ్లారని.. అడ్డుకునేందుకు సిబ్బందితో క‌లిసి వెళ్లిన ఆర్ఐ అర‌వింద్‌ ను జేసీబీతో నెట్టి ఆర్ఐని హ‌త్య చేసేందుకు మాఫియా య‌త్నించిందని ఆయన ఆరోపించారు. అయితే అరవింద్ త్రుటిలో త‌ప్పించుకోవటంతో పెను ప్రమాదం తప్పిందని గుర్తు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అర‌వింద్‌కు అండ‌గా నిలిచాయి. అర‌వింద్‌ను హ‌త్య చేసేందుకు య‌త్నించిన వారిని అరెస్ట్ చేయ‌డంతో పాటు వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘం నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Ycp