Nara Lokesh: నారా లోకేష్ (Nara lokesh) అంటే ప్రత్యర్థి పార్టీలు ఒకప్పుడు కామెడీగా తీసుకునేవి.. విమర్శలను అస్పలు తీసుకునేవి కావు. తెలుగు మాట్లడడం రాదనే ముద్ర వేశారు. కానీ ఎన్నికల్లో ఓటమి తరువాత లోకేష్ లో మార్పు కనిపించింది. ఇప్పుడు లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే లోకేష్ నే నిత్యం టార్గెట్ చేస్తోంది. అంటే ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ (TDP) ఆవిర్భావ సభలో చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయంగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా మామ బాలయ్య.. సినిమాల్లో చెప్పే లాంటి డైలాగ్స్ తో రెచ్చిపోయారు. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్. లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద 2 లక్షల రూపాయల అప్పు ఉండబోతోందని ఫైర్ అయ్యారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్లే సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని.. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ (YCP) నేతలను అధికారులను వదిలి పెట్టనని హెచ్చరించాడు.
లోకేష్ మాటల్లోనే చెప్పాలి అంటే.. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్లే సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలి. ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. లోకేష్ మూర్ఖుడు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను అధికారులను వదిలి పెట్టను. అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా వదిలి పెట్టను. తల్లి బాధేంటో నాకు తెలుసు.. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను.. నేను అన్నీ గుర్తు పెట్టుకుంటాను అంటూ సినిమా డైలాగ్ లు పేల్చారు.
ఇదీ చదవండి : 40వ ఆవిర్భావ దినోత్సవం రోజు కీలక నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు..
అధికారంలోకి వచ్చాక తనతో మాట్లాడాలంటే 12 కేసులుండాల్సిందే. 12 కేసులకంటే తక్కువగా ఉన్నాయంటే వైసీపీపై పోరాడ లేదని దాని అర్థం అన్నారు. గతంలో కేసులు పెట్టుకోవాలంటే కొంచెం నామోషీగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇప్పుడిలాగే ఉండాలి. రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా టీడీపీకే సాధ్యం అంటూ విమర్శించారు. సిల్వర్ స్క్రీన్ సింహా అల్లుడి సింహనాదం అంటే ఎలా ఉంటుంది అంటున్నారు టీడీపీ అభిమానులు.. టీడీపీ అన్ స్టాపబుల్ అన్నారు.
ఇదీ చదవండి : కొత్త కేబినెట్ ముహూర్తం ఇదే.. అదే రోజు విందు.. రాజీనామాలు..
ప్రజల పార్టీ అధికారంలోకి వస్తుందని.. గాలి పార్టీ పక్కకు జరుగుతుంది అన్నారు. మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తన తల్లిని-చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారన్నారు. తెలుగు దేశానికి బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ వాడారు. చంద్రబాబు పసుపు కుంకమ ప్రజలకు ఇస్తే.. వైసీపీ పసుపు కుంకుమలు చెరిపేస్తోందంటూ సెంటిమెంట్ డైలాగులు వల్లించారు. ఫించన్ పెంచుకుంటూ పోతానన్న జగన్.. నిత్యావసరాల ధరలను పన్నులను సీఎం జగన్ పెంచుతూ పోతున్నారన్నారు. రాముడు లాంటి చంద్రన్న కావాలా..? రాక్షసుడు లాంటి జగన్ కావాలా..? అంటూ భారీ డైలాగ్స్ తో మరో రేంజ్ కు వెళ్లారని తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.
అక్కడితోనే అతడి డైలాగ్ వార్ ఆగలేదు. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా..? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా..? సమాజంలో సగం ఉన్న బీసీలకు అధికారం అందించిన పార్టీ టీడీపీనే. ఎంతో మంది ఉన్నత విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే అని గుర్తు చేశారు.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి.. లోక్ సభలో ఎంపీ డిమాండ్
దళితులను లోక్ సభ, అసెంబ్లీ స్పీకరులుగా చేసిన ఘనత టీడీపీదే. దేశంలో సంక్షేమానికి పునాది వేసింది ఎన్టీఆర్.. అభివృద్ధి చేసి చూపింది చంద్రబాబు. అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఎన్టీఆర్. దేవుడు ఎన్టీఆర్.. రాముడు చంద్రబాబు అన్నారు. 1985లోనే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.. మళ్లీ 2024లో టీడీపీ జెండా ఎగరేయాలి.. చరిత్ర తిరగ రాయాలి. కార్యకర్తల సంక్షేమం చూసే బాధ్యత నాకు దక్కింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది.. పెద్ద ఎత్తున సభ్యత్వం చేపట్టాలన్నారు. లోకేష్ మాటతీరు, తెగువ పెరిగిందని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP