AP POLITICS TDP LEADER NARA LOKESH SLAMS ON YCP ON LAND GRABBING IN VISAKHAPATNAM NGS
Nara Lokesh: అధికార పార్టీ కబ్జాల నుంచి కాపాడుకుందాం.. అండగా ఉంటామని లోకేష్ భరోసా
సీఎంపై లోకేష్ విమర్శలు
Nara Lokesh: అధికార పార్టీ చేసిన భూ కబ్జాల నుంచి విశాఖ నగరాన్ని కాపాడుకుందాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. నగర వాసులకు తాను అండగా ఉంటాని లోకేష్ పిలుపు ఇచ్చారు.
Nara Lokesh: పర్యాటక పరంగా.. వాణిజ్య పరంగా.. ఐటీ పరంగా అన్ని రంగాల్లో నెంబర్ వన్ అనిపించుకుంటూ.. ప్రశాంతంగా ఉండే విశాఖ (Visakha) నగరం పై అధికార వైసీపీ (YCP) ఫోకస్ చేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. అక్కడి భూములను కబ్జాలు చేయడానికి వైసీపీ గుండాలు ఎంటర్ అయ్యారని.. ఆ షాకుతోనే విశాఖను రాజధాని చేస్తామని అసత్యాలు చెబుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. తాజా విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన. ఇప్పటికే విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించారు.
విశాఖలో ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అని మండిపడ్డారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో వైసీపీ ల్యాండ్ మాఫియా అరాచకాలకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉన్నతాధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన నిలదీశారు.
ప్రజల్ని కాపాడే పోలీసులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని నారా లోకేష్ ప్రశ్నించారు. విశాఖపట్నంలో వైసీపీ కబ్జాల పర్వానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన.. బాధితులంతా బయటకు రండి.. వైసీపీ కబ్జా కోరల నుండి విశాఖని రక్షించుకుందాం.. అలా ఎవరు వచ్చినా వారికి అండగా టీడీపీ పోరాడుతుందని లోకేష్ స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్‌పై హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. సీఎం వైఎస్ జగన్ మాటలు కోటలు దాటుతాయి.. కానీ, చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని ఎద్దేవా చేశారు..
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు బాకరపేట బస్సు ప్రమాద ఘటనలో 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయి...చేతలు తాడేపల్లి ప్యాలస్ కాంపౌండ్ కూడా దాటవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేమిటి? కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.(1/2) pic.twitter.com/aT1ya5A0lg
విపక్షాలు కొత్త డిమాండ్లు ఏమి పెట్టడం లేదన్నారు.. ఆనాడు తాను అన్నట్టుగానే బాకరాపేట ప్రమాద మృతుల కుటుంబాలకు 20 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.