Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో భారం పడింది. సామాన్యుడికి అందుబాటులో ఉండే రావాణ వాహనం ఆర్టీసీ.. ఆ ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. దీంతో దూర ప్రయాణం చేసే వారి నడ్డి విరగనుంది. తాజాగా పెంపుపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వరుస ట్వీట్ల వర్షం కురిపించారు.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలపై మరో బాదుడు పడింది. నేటి నుంచి పెరిగిన బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ మోత (APSRTC Charges Hike)మోగిస్తోంది. ఈ ప్రభావం తిరుమల (Tirumala) వెళ్లే భక్తులపైనా పడింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారిపైనా భారం పడుతోంది. మరింత ప్రభావం చూపించనుంది. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam) సిటీ బస్సులకు మాత్రం ఛార్జీల పెంపును మినహాయించారు. దూర ప్రాంత ప్రయాణాలకు ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు సామాన్యుడికి భారంగా మారాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కొంత భారం తగ్గించుకోవచ్చన్నది ఆర్టీసీ యాజమాన్యం ఉద్దేశం. అయితే దూరాన్ని బట్టి ఛార్జీలను పెంచామని, ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరుతుంది. కానీ ఆర్టీసీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
తాజా ప్రభుత్వం నిర్ణయంతో ఏపీ వ్యాప్తంగా సామాన్యుల భారీగా భారం పడనుంది. ఎందుకంటే ఎక్కువందికి అందుబాటులో ఉండే రవాణా సదుపాయం ఆర్టీసీ మాత్రమే.. అయితే ఇప్పటికే ఏపీలో భారీ ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా నిర్ణయంతో మరింత బాదుడు పడుతుందని భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని రేట్లు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచితే సామాన్యుడు బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఆర్టీసీ వడ్డపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడం కాదా అని ట్విట్టర్లో లోకేష్ ప్రశ్నించారు.
జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమే.(1/3)#BaadudeBaaduduByJaganpic.twitter.com/LurytMZ4hi
పేద, మధ్య తరగతి ప్రజల ప్రయాణ సాధనాలైన పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా 25 రూపాయలు, ఎక్స్ ప్రెస్ లో 90 రూపాయలు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ 120 రూపాయలు, ఏసీ సర్వీసుల్లో 140 రూపాయలు పెంచారని, రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో 500 కోట్లు పేదల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వమని లోకేష్ ఆరోపించారు.
పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం.(2/3)
ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణమని మండిపడ్గారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని.. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు.(3/3)
కేవలం నారా లోకేష్ అనే కాదు.. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రకాల ఛార్జీు పెంచేశారని.. కరోనా దెబ్బతో అందరి ఆదాయ మార్గాలు తగ్గాయని.. ఇలాంటి సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలపై బారం మోపితే ఎలా అని అన్ని వార్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.