AP POLITICS TDP LEADER NARA LOKESH SLAMS AP CM YS JAGAN AS HE QUESTIONS YCP GOVERNMENT ON FARMERS WELFARE FULL DETAILS HERE PRN
Lokesh Letter to Jagan: రైతు లేని రాజ్యంగా ఏపీ..! సీఎం జగన్ కు లోకేష్ 17 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని డిమాండ్..
నారా లోకేష్ (ఫైల్)
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కార్యక్రమాన్ని ప్రారభించగా.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ (TDP¬).. సీఎం జగన్ (AP CM YS Jagan) పై మండిపడుతోంది.
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కార్యక్రమాన్ని ప్రారభించగా.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ (TDP¬).. సీఎం జగన్ (AP CM YS Jagan) పై మండిపడుతోంది. రైతులకు ఇచ్చిన హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి ఏపీని రైతుల్లేని రాజ్యంగా మార్చారని లోకేష్ మండిపడ్రు. సీఎం జగన్ పాలనలో రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయరంగ సంక్షోభం.. వారి తండ్రిగారి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. "జగన్ పాదం ఎఫెక్ట్ తో రైతు రాజ్యం దేవుడెరుగు రైతు బ్రతికుంటే అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని, తన ప్రశ్నలకు సమాధానం చెప్పాకే జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలని" డిమాండ్ చేశారు. ఈ మేరకు 17 ప్రశ్నలతో కూడిన లేఖను సీఎం జగన్ కు రాశారు లోకేష్.
సీఎం జగన్‌కి నారా లోకేష్ సంధించిన ప్రశ్నలు
1) అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు?
2) మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా?
3) రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా ?
4) 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ?
5) ఇన్ పుట్ సబ్సిడీ ఎక్కడ ?
6) తుఫాన్లు, అకాల వర్షాలతో, నష్టపోయి రైతులకు పంట నష్టం పరిహారం ఎంత ఇచ్చారు?
7) పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు..రైతులకి ఇన్సూరెన్స్ వర్తించలేదెందుకు?
8) రూ.12,500 రైతు భరోసా ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు?
9) రాష్ట్రవ్యాప్తంగా వున్న కౌలురైతులని అసలు గుర్తించారా?
10) వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి ?
11) కేంద్రం తెచ్చిన వ్యవసాయరంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు?
12) ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడే మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరు?
13) టిడిపి హయాంలో రైతులకు రూ.3లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని కేవలం రూ.1లక్షకే పరిమితం చేసింది ఎవరు?
14) రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడవస్థానంలో వుండటానికి కారకుడివి మీరు కాదా?
15) ముదిగొండ లో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న గారి చరిత్ర మర్చిపోయారా?
16) సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన రైతులు ఆరుగుర్ని కాల్చి చంపించింది మీ నాయన రాజశేఖరెడ్డి కాదా?
17) రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకి సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడు ఆదేశాలతో?
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.