AP POLITICS TDP LEADER NARA LOKESH SETAIRS ON SPDCL CLARITY ON RAOD ACCIDENT IN SATYA SAI DISTRICT NGS NJ
Nara Lokesh on Accident: ఉడుతా ఉడుతా ఊచ్.. ప్రమాదానికి కారణం అదా? ప్రభుత్వ వివరణపై లోకేష్ సెటైర్లు
ఆటో దుర్ఘటనపై సీఎం జగన్ స్పందన
Nara Lokesh on Accident: ఆంధ్రప్రదేశ్ లోని ఘోర ప్రమాదానికి విద్యుత్ అధికారు నిర్లక్ష్యమే కారణమని అంతా ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఉడుతదే ఆ పాపం అంటోంది. మహిళ కూలీలు సజీవ దహనమైన ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పుకొచ్చారు. దీంతో అధికారు వివరణపై ఇటు సోషల్ సెటైర్లు పేలుతున్నాయి.
Nara Lokesh on Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉదయాన్ని ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) భయపెట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి, గవర్నర్ దిగ్ర్భాంతి ప్రకటించి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా బాధ్యులు ఎవ్వరైనా వారిని కథినంగా శిక్షించాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం హడావిడిగా పరుగులు తీసింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎవరి నిర్లక్ష్యమో అంటూ తీగ లాగుతూ పోయిన అధికారులకు డొంక కదిలింది. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ (SPDCL) సీఎండీ హరనాథరావు ఓ వింత వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారణం ఓ ‘ఉడుత’ అని దీంట్లో తమ తప్పేమీ లేదన్నారు. విద్యుత్ స్థంభంపై ఉన్న ఉడుత వైర్లు కొరకటంతో ఆటోమీద ఉన్న ఇనుప స్టాండ్ పై ఆ వైర్లు పడి షార్ట్ సర్యూట్ అవ్వటం వల్ల ఈ ఆటో ప్రమాదం జరిగిందని హరనాథరావు (Haranath Rao) చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం విచారణపై విజినెన్స్, సాంకేతిక కమిటీతో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఆయితే ఆయన విని అందరూ ఖంగుతిన్నారు.
పొట్ట కూటి కోసం పొద్దునే కూలీ పనులకు ఆటోలో బయలు దేరిన వారిని మృత్యువు వెంటాడింది. వాళ్లు వెళ్తున్న దారిలో ఆటోమీద హైటెన్షన్ వైర్లు పడిన ఘటన అందరిని ఆవేదనకు గురిచేసింది. మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది. అయితే ఈ ఘటన జరిగిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సమగ్ర విచారణ జరపకుండా ఎస్పీడీసీఎల్ చేసిన ఈ ప్రకటన బాధ్యతా రాహిత్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆటో ఘటనపై నారా లోకేష్ (Nara Lokesh) వరుస ట్వీట్లు చేశారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.
తేనెటీగల వల్ల రథం తగలబడటం,ఎలుకలు మందు తాగడం,కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం,ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి.ఇంకా నయం!కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు(1/2) pic.twitter.com/nb7w14ZY3I
ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందంటూ మరో ట్వీట్ లో లోకేష్ విమర్శించారు.
ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది.(2/2)
సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత:తాడిమర్రి సబ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో ప్రమాద మృతుల బంధువులు సబ్ స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ బాధితులకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. మృతులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.