హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: రాజకీయంగా దూకుడు పెంచిన లోకేష్.. ఈ నెల 19న సీఎం ఇంటి ముట్టడికి పిలుపు

Nara Lokesh: రాజకీయంగా దూకుడు పెంచిన లోకేష్.. ఈ నెల 19న సీఎం ఇంటి ముట్టడికి పిలుపు

దూకుడు పెంచిన నారా లోకేష్

దూకుడు పెంచిన నారా లోకేష్

నారా లోకేష్ రూట్ మార్చారు.. నిత్యం ఇకపై ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 19న ఏపీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపు ఇఛ్చారు.

  టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. గతంలోలా కేవలం పార్టీ కార్యాక్రమాలకు మాత్రమే పరిమితం అవ్వడం లేదు. పార్టీ వ్యవహారాలన్ని అధినేత చంద్రబాబు చూసుకుంటే.. ఆయన ప్రజల్లో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే.. ప్రజల్లో ఉంటూ పోరాటం చేయడమే మంచిదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యలపై వరుస పోరాటాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు. అలాగే తను చేస్తున్న పోరాటాలకు జనం మద్దతు కూడా పొందేలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఆయన యూత్ టార్గెట్ గా ఆయన ఉద్యమాలను ఎంచుకుంటున్నారు. ఏ అంశంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో అంశాన్ని భుజాన వేసుకుంటూ.. వారి సమస్యపై పోరాటానికి సై అంటున్నారు. అధికార వైసీపీకి సవాల్ విసురుతున్నారు..

  ఇటీవల ఏపీలో ఇంటర్, పది పరీక్షలపై అలుపెరుగని పోరాటం చేసి నారా లోకేష్ విజయం సాధించారు. ఆయన పోరాటానికి ప్రజల్లో మంచి గుర్తింపే వచ్చింది. ఒకనొక సమయంలో ఏపీలో పరీక్షలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినా.. అలా చేస్తే లోకేష్ కు క్రెడిట్ వస్తుందని.. పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్లిందని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరిగింది. లోకేష్ తన పోరాటంలో విద్యార్థుల, వారి తల్లిదండ్రులను కలుపుకుని వెళ్లడంతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదు. కారణం ఏదైనా చివరికి లోకేష్ డిమాండ్ చేసినట్టే ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి.

  సుప్రీం తీర్పుతో పరీక్షలు రద్దు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం ఆ విజయం లోకేష్ దే అంటూ ప్రాచరం చేశారు. లోకేష్ ను టీడీపీ నేతలు పొగడ్తల్లో ముంచెత్తారు. ఇలా తాను ఎత్తుకున్న తొలి ఎసైన్ మెంట్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు నిరోద్యోగుల సమస్యపై పోరాటానికి లోకేష్ సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సీఎం ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని లోకేష్‌ అన్నారు. ప్రభుత్వ వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని లోకేష్‌ ఆరోపించారు. ఏపీలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగేలా చేసే వరకు తన పోరాటం ఆగదన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు