హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: ఓడించడానికి జగన్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. పాదయాత్రపై క్లారిటీ

Nara Lokesh: ఓడించడానికి జగన్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. పాదయాత్రపై క్లారిటీ

నారా లోకేష్ పాద యాత్రకు భారీ స్కెచ్

నారా లోకేష్ పాద యాత్రకు భారీ స్కెచ్

Nara Lokesh: తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పాదయాత్రపైనా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పాయాత్ర ఉంటుంది అన్న వివాలను వెల్లడించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mangalagiri, India

Nara Lokesh Padayatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపు కోసం అన్ని పార్టీల వ్యూహాలతో  రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నరే సమయం ఉండడంతో అన్ని పార్టీలు భారీ ప్లాన్స్ ను రెడీ చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉండేలా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. దీనిలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. జనం బాట పడ్డేందుకు సిద్ధమవుతున్నారు.  జనవరి 27వ తేదీ నుంచి పాదయత్రకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పాద యాత్ర ఎలా ఉండోబోతోంది కూడా చెప్పారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను ఓడించడమే  లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని లోకేష్ ఆరోపించారు. మంగళగిరిలో తనను ఓడించేందుకు ఇప్పటికే అన్ని అస్త్రాలను జగన్ సిద్ధం చేశారని.. జగన్  కుట్రలను ప్రజలు నమ్మే  పరిస్థితిలో లేరు అన్నారు. ఈ సారి తన గెలుపును వైసీపీ నేతలు అడ్డుకోలేరని సవాల్ విసిరారు.

సీఎం జగన్ చెపుతున్నదాని ప్రకారం ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నరే ఉండటంతో ఇప్పటినుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 2023, జనవరి 27 నుంచి రాష్ట్రమంతటా పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండేందుకు రెడీ అయ్యారు. మంగళగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా మారిన మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తమ భుజాన వేసుకోవాలని నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. తన పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. అయితే అందులో మంగళగిరిలోనే నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజులు మాత్రం రాష్ట్రమంతా తిరగనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి : సీఎం వైఎస్ఆర్ ఆదేశాలను కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారా..? ఆ రోజు ఏం జరిగింది అంటే?

పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి యువత, నిరుద్యోగులు, దళిత, బడుగు బలహీన వర్గాలను దగ్గర చేసే విదంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి  బాధ్యతలను కొంనియోజకవర్గాల బాధ్యతను వారే చూస్తుంటారు. ముఖ్యంగా కొందరి యువ నేతలను ఎంపిక చేసి.. పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యువకులు.. రైతులకు లోకేష్ ను చేరువ చేేసేలా ఈ పాద యాత్రను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి  పాదయాత్రలు చేసిన నేతలు అధికారం సాధిస్తూ వస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు