Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH FULL FIRE ON YCP MAINLY HER SLAMS MY MOTHER NGS

Nara Lokesh: మహిళలకు మంత్రి రోజా క్షమాపణలు చెప్పాలి.. చీర పంపిస్తే తన తల్లికి ఇస్తా అన్న లోకేష్

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: వైసీపీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నారా లోకేష్.. తాజాగా మంత్రి రోజా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆమె తక్షణం మహిళందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా ఆమె చీర పంపిస్తే తన తల్లికి ఇచ్చి గౌరవిస్తను అన్నారు లోకేష్.. ఇంతకీ రోజా ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Nara Lokesh: గుంటూరు జిల్లా (Guntur District)లోని రెండు దారుణ ఘటనలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతోంది. అయితే టీడీపీ (TDP) కేవలం రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతోందని వైసీపీ (YCP) నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. ఈ దారుణ ఘటనలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది.

    గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే గౌరవం, భయం లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. రాళ్ల దాడికి భయపడేది లేదన్నారు.

    ఇదీ చదవండి: 2024 ఎన్నికలకు ఆ రెండితోనే పొత్తు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

    ముఖ్యంగా ఏపీ రాష్ట్ర మహిళ మంత్రి రోజా (Minster Roja) విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నారా లోకేష్  ప్రస్తావించారు. చీర పంపిస్తే తన తల్లికి ఇస్తానని.. మొత్తం మహిళ సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మంత్రులు శాసనమండలిలో మాట్లాడరని, శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు చెప్పారు. మహిళా మంత్రి అయి ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అన్నారు.

    ఇదీ చదవండి : మహిళా మంత్రి గ్రాండ్ పార్టీ.. అనుకోని అతిథి రాకతో.. రాజకీయంగా ఆసక్తి

    మంత్రిగా ఉండి.. సాటి మహిళ అయి.. చీరలపై వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడమేనని తెలిపారు. చీరలు కట్టుకున్న మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతారా అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లాలో రెండు ఘటనలు జరిగాయని.. ఈ ఘటనలు మహిళా కమిషన్ ఛైర్మన్ కు కనిపించవా ? ప్రశ్నిస్తే నోటీసులు పంపిస్తారా ? ప్రశ్నించారు.

    ఇదీ చదవండి : : కుప్పం = 175.. ఇదే వైసీపీ లెక్క.. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఓడిస్తే 175 నెగ్గినట్టేనా..?

    ఇంతకీ రోజా ఏమన్నారంటే రాష్ట్రాన్ని అభివృద్ధిని నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని.. ఆయన్ను విమర్శిస్తే సహించలేమన్నారు. పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎన్నికలకు పోలేని చంద్రబాబు నాయుడుకు చీర.. చుడీదార్ కావాలో ఆలోచించుకోవాల్సింది ఆయనేనని.. తాము కాదన్నారు. డ్వాక్రా సంఘాలకు 14 వేల 500 ఎగ్గొట్టారని.. వాళ్లు చీరలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నారా లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని, పచ్చ చీర, పసుపు చీరలు పంపిస్తామన్నారు. ఆ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన వ్యాఖ్యలకు మళ్లీ రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు