Nara Lokesh on CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార విపక్షాల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే.. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు ఇఫ్పటికే ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. దీంతో మాటలు యద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా సీఎం జగన్ (CM YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జగనన్న వసతిదీవెన (Jagananna Vasath Deevena) రెండో విడత నగదును విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు విమర్శలు చేయడం తప్పా.. ప్రభుత్వం చేసే మంచి పనులు కనిపించవు అన్నారు. అక్కడితో ఆగని ఆయన.. ప్రజల దీవెనలు ఉన్నంత వరకు అంతా కలిసి వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు నారా లోకేష్. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. విమర్శలు కురిపించారు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని అందరికీ తెలిసిపోయిన తరువాత.. ఎవరికైనా ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్ అంటూ ఎద్దేవ చేశారు.
గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ @ysjagan గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం.(1/2) pic.twitter.com/ovLSHLc9EC
— Lokesh Nara (@naralokesh) April 8, 2022
అక్కడికే పరిమితం కాని లోకేష్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి.. మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక తమకు లేవు అన్నారు. వైసీపీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పని చేస్తున్నామన్నారు. ప్రజలు మీ వెంట్రుకలు పీకడం కాదు.. గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు రెడీగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయినా తన మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి అప్పుడు మీ తలపై వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం అంటూ పంచ్ డైలాగ్ లు పేల్చారు. ప్రజలే పీకుతారు.. కొంచెం ఓపిక పట్టు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తూ మండిపడ్డారు.
గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ @ysjagan గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం.(1/2) pic.twitter.com/ovLSHLc9EC
— Lokesh Nara (@naralokesh) April 8, 2022
ఈ మాటల యుద్ధానికి ఇప్పటితో ఎండ్ కార్డు పడేలా లేదు. మరి లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలాంట ికౌంటర్లు ఇస్తారో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Nara Lokesh, TDP, Ycp