Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH FIRE ON ANDHRA PRADESH BUDGET 2022 HE SAID NO REALITY ON FINANCE MINSTER SPEECH NGS

AP Budget 2022: అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం.. ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

Lokesh on AP Budget 2022: తమది సంక్షేమ ప్రభుత్వం అని.. నవరత్నాలు, సంక్షేమ పథకాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. బడ్జెట్ లో బీసీల ఊసేది అని ప్రశ్నించారు. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం అంటూ సెటైర్లు వేశారు.

ఇంకా చదవండి ...
    Nara Lokesh AP Budget 2022: అంద్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly)లో తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైసీపీ (YCP) నేతలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తమది సంక్షేమ ప్రభుత్వం అని.. బడ్జెట్ లో అది కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నీతి ఆయోగ్ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  విపక్షాలు మాత్రం బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్ ను చూస్తుంటే మసి బూసిన మారేడు కాయలా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ బడ్జెట్ పై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు.

    ఈ బడ్జెట్ లో బీసీల ఊసేది ? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజమని సెటైర్ వేశారు. వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని లోకేష్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి చెబుతున్న లెక్కలకు.. వాస్తవానికి ఏమైనా పొంతన ఉందా అని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇంత దారుణమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదన్నారు. అవాస్తవాలు చెబుతూ ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారంటూ ఆయన నిలదీశారు.

    ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ భయం భయం.. వెనక్కు వెళ్తున్న సముద్రం.. ఈ మార్పు దేనికి సంకేతం

    ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని, అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసగించటమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం..వాహన మిత్ర అబద్దం.. డ్రైవర్లను మోసం చేశారన్నది నిజమని అభిప్రాయపడ్డారు లోకేష్. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని, హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టడం వాస్తవం కాదా అని ఆయన రని విమర్శించారు. మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని నారా లోకేష్ విమర్శించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Budget 2022, AP News, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు