Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NARA LOKESH DEMAND TO CM JAGAN MOHAN REDDY WILL ASK SUPPORTS FOR SPECIAL STATUS NGS

Nara lokesh: ప్రత్యేక హోదా ఇస్తేనే.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు.. లోకేష్ కొత్త డిమాండ్.. వైసీపీ సమాధానం..!

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara lokesh: రాష్ట్రపతి ఎన్నికకు.. ఏపీలో రెండు ప్రధాన పార్టీల స్టాండ్ ఏంటి? రెండు పార్టీలు ఇప్పటి వరకు బీజేపీని పెద్దగా టార్గెట్ చేసింది లేదు..? దీంతో రెండు పార్టీల మద్దతు బీజేపీకే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. మరి వైసీపీ సమాధానం ఏంటి..?

ఇంకా చదవండి ...
    Nara lokesh: దేశ వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక (President Elections) పై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై ఎవరి లెక్కలు వారికున్నాయి.  ఏపీలో ప్రధాన పార్టీల మద్దతు ఎవరికి అన్నది కూడా ఆసక్తి పెంచుతోంది. టీడీపీ (TDP) కి పెద్దగా బలం లేకపోయినా.. ఆ ఓట్లు బీజేపీ (BJP) కి మేలు చేసేవే.. వైసీపీ (YCP) ఓట్లపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి నెగ్గాలి అంటే వైసీపీ ఓట్లు తప్పని సరి.. ఈ నేపథ్యంలో నారా లోకేష్ (Nara Lokesh) కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.  ఆయన ఏపీ సీఎం జగన్‌కు (CM Jagan) సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి.. గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే బలం ఉన్న వైసీపీ ఓటు వేస్తుందా..? అలాంటప్పుడు తమ మద్దతు ప్రకటించాలి అంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ జగన్ ను లోకేష్ ప్రశ్నించారు.

    ఎందుకంటే గతంలో జగన్ మాట్లాడుతూ.. కేద్రంలో బీజేపీకి పూర్తి బలం ఉంది. ఇలాంటి సమయంలో వేడుకోవడం తప్ప డిమాండ్ చేయలేం అని జగన్ అన్నారు. కానీ ఇప్పుడు జగన్ అవసరం బీజేపీకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు ఓటములపై వైసీపీ ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే ఈ డిమాండ్ ను వైసీపీ వినియోగించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందుకే లోకేష్ సైతం ఇప్పుడు అదే ఛాలెంజ్ చేశారు. 

    దీనికి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారని. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే.. ఆ పని చేయండి అంటూ ట్వీట్ చేశారు.

    ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి? అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాష్ట్ర పతి ఎన్నికపై రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి పూర్తి బలం లేకపోవడంతో.. బీజేపీపై ఆగ్రహం ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం జగన్ లాంటి వారిని కలుపుకొని వెళ్లాలి అన్నా.. ఆయన నుంచి సమాధానం రాలేదంటున్నారు కొందరు జాతీయ నేతలు. అయినా విపక్షాలన్నీ తమ అభ్యర్థిని గెలుపించుకునే దిశగా పావులు కదుపుతున్నాయి.

    ఇదీ చదవండి : మొన్న దావోస్.. త్వరలో పారిస్.. మరో విదేశీ పర్యటనకు సీఎం జగన్.. కూతురు చేతికి పట్టా వచ్చే వేళ

    రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15వ తేదీన జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉండనుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కించనున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు