Nara Lokesh: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ను ఎలాగైనా అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం (YCP Government) కక్ష కట్టిందని ఆ పార్టీ నేతలు అరోపిస్తున్నారు. అందుకే అక్రమ కేసులు పెడుతూ.. ఇలా కోర్టులు చుట్టూ తిప్పుస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా నారా లోకేష్.. విజయవాడ (Vijayawada) మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. 2020 లో ఆ పార్టీ కీలక నేత.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchamnaidu) అరెస్ట్ సమయంలో అతడికి మద్దతుగా ఏసీబీ కోర్టు దగ్గరకు లోకేష్ వచ్చారు. అయితే ఆ సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా లోకేష్ హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు కొల్లు రవీంద్ర (Kollu Ravindra).. ఇతర నేతలు సైతం వచ్చారు. లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల తీరుపట్ల తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ కు ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ టీడీపీ నేతలు పోలీసులతీరును తీవ్రంగా తప్పు పట్టారు.
ఇంతకీ అచ్చెన్న కేసు ఏంటంటే.. చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2020 జూన్ 12న ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటికే సర్జరీ కారణంగా ఇబ్బంది పడుతున్న అచ్చెన్నాయుడును ఆస్పత్రిలో చేరేందుకు కోర్టు అనుతిచ్చింది. ఆ తరువాత ఏసీబీ అధికారులు ఆయనను ఆస్పత్రిలోనే విచారించారు. కొన్ని వారాలకు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో సుదీర్ఘంగా అంటే 70 రోజుల పాటు ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఆ తరువాత కరోనా కారణంగా మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారు. మొత్తంగా 80 రోజుల పాటు ఇంటికి దూరంగా ఆయన ఉండాల్సి వచ్చింది.
ఇదీ చదవండి : నవ వధువు మృతి కేసులో వీడిన మిస్టరీ.. విచారణలో సంచలన విషయాలు
అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ నిరసన చేపట్టిన కారణంగా.. ఇప్పుడు లోకేష్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లో కరోనా నిబంధనలు కఠినంగా ఉండేవి.. ఆ నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు వ్యక్తిగతంగా హాజరైన లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని విమర్శించారు.
ఇదీ చదవండి వచ్చే ఎన్నికల్లో జనసేనకు మెగా మద్దతు.. అభిమానుల ప్రత్యేక సమావేశం.. ఏం డిసైడ్ అయ్యారంటే
55 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అవన్నీ అక్రమ కేసులే అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. అందుకే ఒక్క కేసు నిరూపించే పరిస్థితి లేదన్న ఆయన.. ప్రజలు, దళితులపైనా ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తనపై ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేసింది.. ఇప్పుడు కోవిడ్ కేసు పెట్టిందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంతో పోరాటంలో తగ్గేదేలేదన్నారు నారా లోకేష్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Vijayawada