Home /News /andhra-pradesh /

AP POLITICS TDP LEADER NALLARI KISHORE KUMAR CHALLANGE TO MINSER PEDDIREDDY RAMACHANDRA REDDY NGS TPT

AP Politics: అలా గెలిచే దమ్ముందా..? పెద్దిరెడ్డికి నల్లారి సవాల్‌.. మంత్రి సై అంటారా..?

ఫోెన్ ట్యాపింగ్ పై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

ఫోెన్ ట్యాపింగ్ పై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. ఇప్పటి నుంచి గెలుపు ఓటములపై సవాళ్లు విసురుకుంటున్నాయి.. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి.. నల్లారి కిషోర్ కుమార్ ఓ సవాల్ విసిరారు.. మరి దానికి మంత్రి ఎలాంటి సమధానం ఇస్తారో చూడాలి.

ఇంకా చదవండి ...
    AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)ల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కుతోంది. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అందుకే ముందుగానే గెలుపు, ఓముల కోసం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Minster Peddireddy Ramachandra Reddy) కి బహిరంగ సవాల్‌ విసిరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి (Ex CM Kiran kumar Reddy) సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి (Nallari Kishore Kumar Reddy) .. చిత్తూరు జిల్లాలకు వైసీపీ పెద్దిరెడ్డిని పెద్ద దిక్కుగా చెప్పుకుంటోందని.. కానీ ఆయనేమీ పెద్ద లీడర్‌ కాదన్నారు. నిజంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దమ్ముంటే..? వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (CM YS Jagan Mohan Reddy)  బొమ్మ లేకుండా సొంతం బొమ్మతో పోటీ చేయగలరా.. అని ప్రశ్నించారు. ఒకవేళ పోటీ చేసినా గెలిచే దమ్ము ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే అధికార వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని గుర్తు చేశారు.. ప్రజలంతా ఒక్క ఛాన్స్ అంటూ మోసోయారని.. ఇప్పుడు ఒక్కఛాన్స్ అన్నారు కదా.. ఇచ్చిన ఛాన్స్ చాలు దించేద్దామని ఫిక్స్ అయ్యరని నల్లారి అభిప్రాయపడ్డారు.

    మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఇంటికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు కిషోర్‌ కుమార్‌రెడ్డి.. చంద్రబాబు ముప్పై ఐదేళ్ల తర్వాత తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు..  2024 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. పుంగనూరులో కూడా విజయం టీడీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి తెలిసిందల్లా దోచుకోవడమేనని సంచలన ఆరోపణలు చేశారు.



    మరోవైపు చిత్తూరు పర్యటనలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఇవాళ పాల్గొన్న చంద్రబాబు.. నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఓవైపు మినీ మహానాడులు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు.. మరోవైపు బాదుడే బాదుడు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పెరిగిన ధరలను, ప్రభుత్వ విధానాలను ఎండగడుతోన్న విషయం తెలిసిందే.

    ఇదీ చదవండి : చంద్రబాబు ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం అదా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత

    అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నల్లారి ఇంటికి చేరుకోవడం ఒక విశేషం అంటున్నారు స్థానిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 35 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి నల్లారి అమరనాధ రెడ్డి.. అప్పట్లో నారా చంద్ర బాబు నాయుడుకు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేలా చేశారు. కాంగ్రేస్ పార్టీలోకి తీసుకుని చంద్రగిరి టికెట్టును కేటాయించారు. ఆరోజు నల్లారి ఇంటికి వచ్చిన చంద్రబాబు తిరిగి ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో బాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగిరిపల్లి గ్రామంలోని నల్లారి ఇంటికి చేరుకుని ఉదయం టిఫిన్ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు