ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రెండువేల నోట్లు కనిపించకపోవడానికి వైసీపీ (YSRCP) నే కారణమంటూ టీడీపీ (TDP) నేత బుద్ధా వెంకన్న (Budha Venakanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర భూకాసురుడు అంటే రాష్ట్రం, దేశం మొత్తం తెలుసని ఎద్దేవా చేసిన బుద్ధా వెంకన్న.., మీది కుల పార్టీనా, మాది కుల పార్టీ నా తేల్చుకుందాం రావాలంటూ ఛాలెంజ్ చేశారు. జగన్ అవినీతి లో భాగమై, జైలుకెళ్లినందుకే మీకు రాజ్యసభ సీటు వచ్చిందన్న బుద్దా.. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలే పోయాయన్నారు. ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారని.., రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసున ఘనుడు జగన్ అని ఆరోపించారు.
బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్న వెంకన్న.., కొడాలి నాని, వెల్లంపల్లి, రంగరాజును తప్పించి వారి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్లు బినామీలుగా ఉన్నారు కాబట్టే జగన్ ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి వయసుకు తగ్గ విధంగా మాట్లాడాలని.. లోకేష్ కు నిక్ నేమ్ పెడితే... మేము చిప్పకూడు విజయసాయి రెడ్డి అని పిలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన చెప్పు చేతల్లో నడిచే వారికే నేడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారన్న వెంకన్న.., బీసీలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు... బీసీల పార్టీ టీడీపీ అని చెప్పారు. బీసీలకు ఇచ్చే అదరణ, పథకాలను జగన్ రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
జగన్ కు సూట్ కేసుల కంపెనీ మోసిన చరిత్ర విజయసాయి రెడ్డిదని.., మార్కెట్ లో రూ.2000 నోట్లు కనిపించకుండా చేసిన ఘనత సీఎందేనని ఆరోపించారు. ఈ డబ్బంతా వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు విజయసాయి రెడ్డి ఈ కొత్త ఎత్తు వేశారన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతిపై సోమిరెడ్డి కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చారని.., వాటిని దొంగిలించారంటే.. ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలన్నారు. జగన్ కేసులలో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందన్నారు. సీబీఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు బుద్ధా వెంకన్న.
మద్యపాన నిషేధం అని అబద్దపు హామీలతో జగన్ గెలిచారని.., మూడేళ్లల్లో ధరలు పెంచి, రెట్టింపు అమ్మకాలు చేసి.. ఖజానా నింపుకున్నార విమర్శించారు. వాలంటీర్లకు ఐదు వేలిచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డి కులాల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని.., చంద్రబాబు కు కులం ఆపాదించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Buddha venkanna, Vijayasai reddy