పల్నాడు(Palnadu)లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీపీ ప్రస్తుతం టీడీపీ(TDP) మండల అధ్యక్షుడిగా ఉన్న బాలకోటిరెడ్డి(Balakotireddy)పై ప్రత్యర్ధులు ఇంట్లోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల(Rompicharla)మండలం అలవాలా(Alawala)లో ఈఘటన కలకలం రేపింది. ప్రత్యర్ధులు దాడిలో టీడీపీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట (Narsaraopet)ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం..
పల్నాడు జిల్లాలో పగలో లేక రాజకీయ విభేదాలో తెలియదు కాని ఓ మాజీ ఎంపీపీ ఇంట్లోకి చొరబడి మరీ తుపాకులతో కాల్పులు జరిపారు. రొంపిచర్ల మండలం ఆలవాలలో జరిగింది ఈదారుణ సంఘటన. నేరుగా బాలకోటిరెడ్డి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇంట్లో ఉన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితులు ఎవరో ..ఎందుకు ఇంతటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలుసుకునే పనిలో పడ్డారు. మరోవైపు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఎన్నికలకు ముందే దాడులు..
ప్రతిపక్ష పార్టీకిచెందిన నాయకులపై ఈతరహా కాల్పులు జరిపి భయబ్రాంతులకు గురి చేయడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చని స్థానికులు, పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఈతరహాలో కాల్పులకు తెగబడితే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని భయపడిపోతున్నారు పల్నాడు ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Palnadu, TDP