ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇటు అధికార వైసీపీ (YSRCP) , అటు ప్రతిపక్ష టీడీపీ (TDP) కి చెందిన నేతలు ఎక్కడా తగ్గేదేలేదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రెండు పార్టీల నేతల విమర్శలు, ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore District) కు చెందిన టీడీపీ నేత హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నారు. ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పిన ఆయన.. ఆ లోగా రాష్ట్రంలో కొన్ని అసాధారణ పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీలో విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పుందంటూ బాంబు పేల్చారు.
వైఎస్ కుటుంబంలో ఎవర్ని ఎవరు చంపారో తెలియదని.. అలాంటిదేమైనా జరిగితే టీడీపీ చేసిందని వైసీపీ అంటుంది కాబట్టి.. విజయమ్మకు, షర్మిలకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరతామన్నారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ కేంద్రానికి లేఖరాయాలన్నారు. విజయమ్మ, షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కు కూడా భద్రత పెంచాలన్నారు.
ప్రస్తుతం ఆనం వెంకట రమణారెడ్డి చెసిన కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఆనం వెంకట రమణారెడ్డి ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, వైఎస్ వివేకానంద రెడ్డిని జగన్ హత్య చేయించారంటూ ఆయన ఆరోపించారు. అంతేకాదు వైఎస్ మరణంపై సొంత మీడియాలో వార్తలు రాయించిన జగన్.. సీఎం అయిన తర్వాత ఎందుకు దర్యాప్తు చేయించలేదని ప్రశ్నించారు. వైఎస్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయలేదంటే వైఎస్ ను చంపింది జగనేనని భావించాల్సి వస్తుందన్నారు. వివేకా హత్యకేసుపై ప్రతిపక్ష నేతగా సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్.. సీఎం అయిన తర్వాత మర్చిపోయారంటే ఆ హత్య కూడా జగనే చేయించారనుకోవాలా అని ప్రశ్నించారు. తాజాగా వైసీపీ వాళ్లే విజయమ్మకు, షర్మిలకు హాని తలపెట్టి తమపై నెడతారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇటీవల వైసీపీ నేతల కామెంట్స్ కు వారి స్టైల్లోనే కౌంటర్లిస్తూ వస్తున్నారు ఆనం వెంకటన రమణా రెడ్డి.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, మద్యం క్వాలిటీపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన ఆయన.. సీఎం జగన్ చదువుపైనా సెటైర్లు వేశారు. లోకేష్ చదువు, జగన్ చదువుపై సర్టిఫికెట్లతో సహా వస్తే చర్చించుకుందామంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు వెంకటరమణా రెడ్డి. ఆనం చేసిన ఆరోపణలకు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Ysrcp