TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతాయి అన్నదానిపై స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను డూ ఆర్ డైగానే భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మిస్ అయితే.. భవిష్యత్తు కష్టమే అనే అంచనాకు వచ్చేశారు.. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో రాజకీయ శత్రుత్వం కాకుండా.. వ్యక్తిగత శత్రుత్వంగా మారింది. పక్క పార్టీని తొక్కేయడానికి పది తప్పులు చేసినా పరవాలేదనే ఫీలింగ్ లోకి ప్రధాన పార్టీలు వెళ్లాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.. అందుకే ఏ చిన్న అవకాశాన్ని ఏ పార్టీ వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు. ఎలాగైనా గెలవాలి అని లక్ష్యం పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఇందలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) .. జనసేన (Janasena) , బీజేపీ (BJP) తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే..? అధికార వైసీపీ (YCP) మాత్రం బీజేపీ, జనసేనలకు టీడీపీకి దూరంగా ఉండాలని భావిస్తున్నాయి. ఆ దిశగా కసర్తుతలు చేస్తూంది. అయితే ఈ పొత్తుల విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ను జనసేన, టీడీపీ ముందుగానే పసిగట్టాయని తెలుస్తోంది. అందుకే పొత్తుల అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టేశాయి.. కానీ అంతర్గతంగా వ్యవహారం అంతా ఫైనల్ అయ్యిందని సమాచారం..
వచ్చే ఎన్నికల్లో వందుకు వంద శాతం జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయి.. పవన్ చొరవతో బీజేపీ సైతం.. ఈ కూటమితోనే బరిలో దిగనుంది అని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే పొత్తు ఖరారు అయినా.. ఎవరికి ఎన్ని సీట్లు.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న విషయంలోనే చిక్కుముడి వీడడం లేదు. 2014లో జనసేన నేరుగా పోటీ చేయకపోవడంతో ఒక్కసీటు అడగలేదు. అప్పటికే ఏపీపై బీజేపీ ఫోకస్ చేయక పోవడం.. సరైన నేతలు లేకపోవడంతో. చంద్రబాబు ఆఫర్ కు బీజేపీ పెద్దలు తల ఊపారు..
కానీ ఇప్నుడు పరిస్థితి మారింది. జనసేన బలం బాగా పుంజుకుంది. కనీసం 30కి పైగా సీట్లలో కచ్చితంగా జనసేన ప్రభావం ఉంటుంది అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.. 30 సీట్లలో గెలిచే పూర్తి బలం లేకున్నా.. గెలుపు ఓటములను ప్రభావితం చేయగల ఓట్లు ఉన్నాయన్నది వారి లెక్క.. అలాగే కచ్చితం గెలుస్తామని ఓ పది సీట్లు కూడా ఉన్నాయని.. రెండు కలిసి సుమారు 40కు అటు ఇటుగా జనసేన డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కానీ జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి డీడీపీ సిద్ధంగా లేదనే ప్రచారం ఉంది. దాదాపు 25 వరకు అయితే సీట్లు ఇచ్చేందుకు రెడీగానే ఉందని.. కానీ మళ్లీ బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది అన్నది కూడా లెక్క తేలాలని.. ఆ తరువాత ఎవరికి ఎన్ని సీట్లు అన్నదానిపై అవగాహన వస్తుంది అంటున్నారు.
ఇదీ చదవండి : చంద్రబాబు దూకుడు.. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే
అయితే తాజాగా పవన్ కళ్యాన్ వ్యాఖ్యలు సైతం పొత్తు ఫిక్స్ అయ్యిందనే అభిప్రాయం కలిగేలా చేస్తోంది. వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని జనసేనానిన బహిరంగంగానే ప్రకటించారు.. తమ వ్యూహాలు తమకున్నాయి.. పరిస్థితులను బట్టి వ్యూహాలు మారుతుంటాయి.. అవసరాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటామని ప్రకటించారు పవన్.. అంతటితో ఆగకుండా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు జనసేనాని.. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు.. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం.. అలాగే పార్టీలో మా వ్యూహాలు మాకుంటాయి అన్నారు. ఇంతకీ కేసీఆర్ ఏం చేశారంటే..? తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం.. మొత్తం ఫ్యామిలీతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు.. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు.. కానీ, ఒంటరిగా పోటీ చేశారు.. రిస్క్ తీసుకుని ముందుకు వెళ్లారు.. అలాగే జనసేన వ్యూహాలు జనసేనకు ఉంటాయి అన్నారు.
ఇదీ చదవండి : ఎన్నికల మూడ్ లో సీఎం జగన్.. అప్పుడే గేమ్ స్టార్ట్ చేశారా..?
పొత్తులపైనా క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీతో కలిసి వెళ్తామా? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా?.. బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేస్తామా? టీడీపీతో కలిసి వెళ్లమా? అనే అంశాలను తాను ఇప్పుడు బయటపెట్టలేను అన్నారు. పరిస్థితులను బట్టి తన వ్యూహాలు మారుతూనే ఉంటాయన్నారు. అంటే స్వయంగా పొత్తుల విషయం ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా.. ఉంటాయనే సంకేతలు అయితే ఇచ్చారు. అలాగే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదనే బేసిక్ పాయింటుతోనే మా వ్యూహాలు ఉంటాయని స్పష్టం చేశారు అంటేనే ఆయన ఉద్దేశం అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Pawan kalyan