AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU TO TOUR RAYALASEEMA DISTRICTS AS HE TARGETS GOVERNMENT ON POWER AND BUS CHARGES FULL DETAILS HERE PRN
TDP: జగన్ ఇలాకాలో చంద్రబాబు.. సీమ టూర్ ప్లాన్ చేసిన టీడీపీ..! అక్కడ కూడా బాదుడే బాదుడు..!
కుప్పంలో చంద్రబాబు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్, బస్సు ఛార్జీల పెరుగుల అంశాన్ని టీటీపీ (TDP) పొలిటికల్ గా క్యాష్ చేసుకుంటోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ చేసిన బాదుడే బాదుడు కామెంట్స్ ను హైలెట్ చేస్తూ ఇప్పుడు టీడీపీ అదే పేరుతో ఉద్యమం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్, బస్సు ఛార్జీల పెరుగుల అంశాన్ని టీటీపీ (TDP) పొలిటికల్ గా క్యాష్ చేసుకుంటోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ చేసిన బాదుడే బాదుడు కామెంట్స్ ను హైలెట్ చేస్తూ ఇప్పుడు టీడీపీ అదే పేరుతో ఉద్యమం చేస్తోంది. బాదుడే బాదుడు పేరుతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు.. మరో పర్యటనకు సిద్ధమయ్యారు. వచ్చే వారం 18వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa District) లోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెలాఖరులో మహానాడు నిర్వహించేలోపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ రెడీ చెసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర, కుప్పంలో పర్యటించి ప్రభుత్వం తీరును చంద్రబాబు ఎండగట్టారు. ఈ పర్యటనల్లో జనం నుంచి వచ్చిన స్పందన చూసి రాయలసీమ పర్యటనను ప్లాన్ చేశారు. వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తే అధికార పార్టీకి గట్టిసంకేతాలిచ్చినట్లవుతుందని టీడీపీ భావిస్తోంది. 2019లో రాయలసీమ జిల్లాల్లో టీడీపీ చావుదెబ్బతింది. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను అదే ప్రాంతంలో ఎండగట్టడం ద్వారా లోకల్ కేడర్‌లో జోష్ నింపినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల్లోపు చంద్రబాబు బస్సు యాత్ర చేపడతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగా ఇలాంటి పర్యటనలు నిర్వహిస్తే.. అసలైన టూర్ కు రోడ్ మ్యాప్ వేసుకున్నట్లువుతందనేది తమ్ముళ్ల బావన. బాదుడే బాదుడు ప్రోగ్రామ్ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎలా ఆకట్టుకోవాలి., స్థానిక అంశాల వారిగా అధికార పార్టీని ఎలా టార్గెట్ చేయాలనే అంశాలపై మరింత ఇన్ పుట్స్ తెచ్చుకోవచ్చనేది బాబు స్కెచ్ గా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే చంద్రబాబు టూర్ ను వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ చేస్తోంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ధరలను విపరీతంగా పెంచలేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు అధికారపార్టీ నేతలు. అధికారంలోకి రామన్న ఫ్రస్ట్రేషన్‌లోనే చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతున్నారని.. ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటున్నారు. మరో 30ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని.. చంద్రబాబు, పవన్ కలిసొచ్చినా సీఎం సీటు మాత్రం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు సీమ టూర్ తర్వాత టీడీపీ ఎలాంటి పొలిటికల్ మైలేజ్ వస్తుందో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.