Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU TO TOUR KUPPAM FOR THREE DAYS TO STRENGTHEN PARTY CADRE FULL DETAILS HERE PRN

Chandrababu: నేటి నుంచి చంద్రబాబు కుప్పం టూర్.. త్యాగాలకు తమ్ముళ్లను సిద్ధం చేస్తారా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకుల ముధ్య ఉన్న వర్గవిభేదాల పరిష్కారమే అజెండాగా ఆయన కుప్పంటూర్ ఉండనుంది.

ఇంకా చదవండి ...
    టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకుల ముధ్య ఉన్న వర్గవిభేదాల పరిష్కారమే అజెండాగా ఆయన కుప్పంటూర్ ఉండనుంది. ఈసారి పర్యటనలో కుప్పం పట్టణంతో పాటు శాంతిపురం, గుడుపల్లె మండలాలలోని పలు గ్రామాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చేరుకోనున్న చంద్రబాబ.., అనంతరం బోయనపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. 12వ తేదీ సీగలాపల్లిలో జాతరలో పాల్గొంటారు. అనంతరం గుడిపల్లె మండలంలో పోగురుపల్లితో పాటు పలు గ్రామాల్లో పర్యటిస్తారు. ఈనెల 13న కుప్పంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. నియోజకవర్గంలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై సమీక్ష జరుపుతారు.

    2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా అప్పుడప్పుడు కుప్పం వెళ్తూనే ఉన్న చంద్రబాబు.. అక్కడే ఇల్లుకట్టుకొవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.

    ఇది చదవండి: బలహీన పడిన అసని తుఫాన్..కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. తీరాన్ని తాకేది అక్కడే..?


    గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ, ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీడయం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాబును ఓడిస్తామని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు కూడా ఎప్పుడూలేనంతగా కుప్పంపై దృష్టిపెట్టారు. అందుకే తరచూ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ.. నాయకులు, పార్టీ కేడర్ తో భేటీలు నిర్వహిస్తున్నారు.

    ఇది చదవండి: నారాయణ తర్వాత చంద్రబాబేనా..? జగన్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?


    పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఫలితాలు దారుణంగా రావడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంత కేడర్ చేజారిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 2019లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగానే సాధించి కుప్పంపై తనపట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. పైగా ప్రభుత్వం విద్యుత్, బస్సు ఛార్జీలు పెంచడంతో సొంత నియోకవర్గంలోనూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

    ఇది చదవండి: పొత్తుల‌పై క‌న్ఫ్యూజ‌న్ లో ప‌వ‌న్..? త్వర‌లో కీల‌క ప్ర‌క‌టన..? న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!


    చంద్రబాబు కుప్పం టూర్ నేపథ్యంలో వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. గత ఏడాది చంద్రబాబు కుప్పం వెళ్లినప్పుడు.. కరోనా సమయంలో సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటూ వైసీపీ నేతలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ సొంత పార్టీ కార్యకర్తలే బాబును కోరారు. ఇటీవల పొత్తులపై చంద్రబాబు చేసిన కామెంట్స్ కు సొంతనియోజకవర్గంలో ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. త్యాగాలు చేస్తామన్న చంద్రబాబు ప్రకటనను తమ్ముళ్లు స్వాగతిస్తారా..? లేదా అనేది చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు