హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: యువతను ముంచింది ఆయనే.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.. చంద్రబాబు ఫైర్..

AP Politics: యువతను ముంచింది ఆయనే.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.. చంద్రబాబు ఫైర్..

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu) ఫైర్ అయ్యారు. జగన్ తన అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాసారని చంద్రబాబు అన్నారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu) ఫైర్ అయ్యారు. జగన్ తన అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాసారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, ఉపాధి దొరక్క యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆయన విమర్శించారు. జగన్ తమకు చేసిన నష్టంపై యువత తీవ్ర అవేదన, అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఏ ఒక్కరు రోడ్డెక్కినా.. వారిని అణచివేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారవ. నిన్నటి వరకు ప్రతిపక్షాలను వేధించారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కులు కాపాడాలని నిరసనకు సిద్ధమైతే అరాచకంగా అరెస్టులు చేస్తున్నారన్నారు.

  రాష్ట్రంలో 800 మందికి పైగా మహిళలపై తీవ్ర స్థాయి నేరాలు చోటు చేసుకుంటే.. ఎంత మందికి న్యాయం చేశారో, ఎందరిని శిక్షించారో సమాధానం చెప్పాలి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని చంద్రబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచింపెట్టిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెకుని నాశనం చేశారు. డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా.. తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారు.

  ఇది చదవండి: మరోసారి ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్.. జాతీయ స్థాయిలో అవార్డు


  "రాష్ట్రంలో పేదరికాన్ని, అసమానతల్ని నిర్మూలించడమే ధ్యేయంగాఎన్నో చర్యలు తీసుకున్నాం. ఆ రోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని రద్దు చేశాం. ఎస్సీ ఎస్టీ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించి కులాల మధ్య అంతరాలను తొలగించాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి.. విదేశీ విద్య వరకు తెచ్చిన సంస్కరణలు ఈ రోజు ప్రజలు ఫలితాలు చూస్తున్నారు. కానీ.. జగన్ వారికి చేసిందేమీ లేకపోయినా.. వారిని రాజకీయంగా వాడుకుంటూ మాపై వ్యతిరేకత సృష్టిస్తున్నారు" అని చంద్రబాబు అన్నారు.

  ఇది చదవండి: మంత్రిగా తన మార్క్ చూపిస్తున్న రోజా.. ప్లేయర్ గా మారిన మినిస్టర్


  "గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమానికి నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదు అనేలా అరెస్టులు చేస్తున్నారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడం ఏంటి? స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆక్వా దెబ్బతినడంతో ఆదాయం తీవ్రంగా పడిపోయింది." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు