Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU SLAMS YS JAGAN ON ELECTRICITY AND BUS CHARGES HIKE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

AP Politics: ఏపీలో జగన్ మోసపు రెడ్డి పాలన.. రివర్స్ నిర్ణయాలతో జీవితాలు రివర్స్.. బాబు ఫైర్..

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandra babu naidu) ఫైర్ అయ్యారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఇందుకు సాక్ష్యం అని ఆయన చెప్పారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandra babu naidu) ఫైర్ అయ్యారు. టీడీపీ వ్యూహకమిటీతో సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. అన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో నష్టం పోని వర్గం అంటూ ఏదీ లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఇందుకు సాక్ష్యం అని ఆయన చెప్పారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందని ఆయన అన్నారు. తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను రివర్స్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక అపరిచితునిలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు.

    రాష్ట్రానికి వైసీపీ పాలన అరిష్టంలా దాపురించిందని.... పన్నులు, చార్జీల పెంపుతో ప్రజల కష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలు కారణం అవుతున్నాయని అన్నారు. జగన్ ఎంత బలహీనుడో అతని క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థం అవుతోందని చంద్రబాబు అన్నారు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందని...బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

    ఇది చదవండి: రాష్ట్రంలో డొల్ల ప్రభుత్వం.. జగన్ సర్కార్ పై సోము ఫైర్.. కృష్ణానది ఒడ్డున స్వచ్ఛభారత్..


    పోలవరం విషయంలో మొదటి నుంచి జగన్ తీసుకున్న తప్పుడు, రివర్స్ నిర్ణయాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయని చంద్రబాబు అన్నారు. రివర్స్ టెండర్ల నిర్ణయం, పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా 2020 లో పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. రివర్స్ టెండర్లలో ప్రజాధనం ఆదా అని గొప్పలు చెప్పిన జగన్… ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్ల జరిగిన నష్టానికే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు అని చంద్రబాబు అన్నారు.

    ఇది చదవండి: ఏపీలో వీరికి విద్యుత్ కోతల నుంచి మినహాయింపు.., గీతదాటితే వాతే..!


    ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కూడా కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా రూ.100 కోట్లు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అందజేశారు.

    ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. అలా చేయకుంటే జీతాలు కట్..?


    పన్నుల భారం, చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల వంటి విషయాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలు ఉంటాయని చంద్రబాబు నేతలకు వివరించారు. త్వరలోనే వీటిని ప్రారంభిచనున్నట్లు వివరించారు. ఇక వచ్చే మహానాడు ఎక్కడ నిర్వహించాలి అనే అంశంలో నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu

    తదుపరి వార్తలు