Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU SLAMS CM YS JAGAN ON THREE CAPITALS ISSUE FULL DETAILS HERE PRN

AP Politics: దమ్ముంటే ఆ పనిచేయండి.. రాజధానిపై జగన్ కు చంద్రబాబు సవాల్..

చంద్రబాబు నాయుడు (ఫైల్)

చంద్రబాబు నాయుడు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మళ్లీ రాజధాని వైపు మళ్లాయి. అసెంబ్లీ (AP Assembly) లో సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనపై ప్రతిపక్ష టీడీపీ (TDP) మండిపడుతోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మళ్లీ రాజధాని వైపు మళ్లాయి. అసెంబ్లీ (AP Assembly) లో సీఎం జగన్ (AP CM YS Jagan) చేసిన ప్రకటనపై ప్రతిపక్ష టీడీపీ (TDP) మండిపడుతోంది. సీఎం జగన్ మళ్లీ మూడు ముక్కలాట మొదలెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. భావితరాల భవిష్యత్తుపై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రాజధాని విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తప్పేం ఉంది..?ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించాలి.. చట్ట సభలు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలు రాజ్యాంగం చెబుతుందన్నారు. కోర్టు తీర్పుపై వితండవాదన చేస్తున్నారని.., కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాన్ని చేయలేరని ఆయన అన్నారు.ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదన్న ఆయన.. చట్టాలను న్యాయసూత్రాలకు అనుగుణంగానే చట్టాలు చేయాని సూచించారు.

  నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందన్న చంద్రబాబు.. తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. నాటి సభలో వైసీపీ కూడా అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించిందని.., ఇప్పుడు చెబుతున్న మాటలే.. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు..? ప్రశ్నించారు. ప్రేమ ఉంది కాబట్టే ఇల్లు కట్టుకుంటున్నానని చెబుతున్న సీఎంకు.., ఇల్లు ఉంటే సరిపోదు.. మంచి మవస్సు ఉండాలన్నారు. నమ్మక ద్రోహం చేసిన వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని.., ఒకసారి రాజధానిని నిర్ణయించిన తర్వాత మార్పు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పని సరి అని చట్టం చెబుతోందన్నారు.

  ఇది చదవండి: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అది మా హక్కు, బాధ్యత..! స్పష్టం చేసిన సీఎం


  అలాగే రాజధాని రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి శనిగ్రహం మాదిరి దాపురించారని.., రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణని చంద్రబాబు అన్నారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలీని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోవాలని సవాల్ చేశారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు విలువ తెలీని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు.

  ఇది చదవండి: మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదే.. అసెంబ్లీలో లెక్కలు చెప్పిన మంత్రి.. 


  వ్యవస్థల మీద దాడులు చేయడం సీఎంకు అలవాటుగా మారిందన్న ఆయన.., శాసన మండలిని రద్దు చేస్తామంటారు.. ఎస్ఈసీని విమర్శిస్తారు.. సీబీఐపై కేసులు పెడతారు.. ఓ ఎంపీని చంపే ప్రయత్నం చేస్తారు.. ఇలాంటివి చేస్తే కోర్టులు ప్రశ్నించవా..? అని అన్నారు. ల్యాండింగ్ పూల్ చేస్తే రియల్ ఎస్టేట్.. బినామీలంటున్నవాళ్లు మూడేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. రాజ్యాంగంలో.. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని.., ఐదేళ్లపాటు ట్రస్టీగా ఉండమన్నారే తప్ప.. అరాచకాలు చేయమనలేదన్నారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలా..? ఐతే ఈ కోడ్ ఎంటర్ చేయండి.. వైసీపీ నేతపై ట్రోలింగ్..


  చట్ట ప్రకారమే అమరావతిని రాజధానిగా నిర్ణయించాంమని.., చేసిన చట్టాన్ని ఉల్లంఘించడానికి ఈ సీఎం ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయం చేయాలని పిటిషనర్లు కోర్టుకు వెళ్తే.. కోర్టు తీర్పు ఇస్తోందని.., ప్రభుత్వమే హద్దులు దాటుతోందని.. కోర్టుల పరిధి గురించి మాట్లాడ్డం సరైన విధానం కాదని హితవు పలికారు. రాజధాని అభివృద్ధి విషయంలో మూడేళ్ల పాటు ఏం చేశారన్న చంద్రబాబు.., రాజధాని రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసమా..? అని నిలదీశారు. ప్రజాహితమైనప్పుడు.. ఒప్పందాలు ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వాలు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు