Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU SLAMS AP CM YS JAGAN ON ELECTRICITY CHARGES ISSUE FULL DETAILS HERE PRN GNT

Chandrababu: ఆ విషయం మేం గర్వంగా చెబుతాం.. మీరు చెప్పగలరా! జగన్ కు చంద్రబాబు ఛాలెంజ్..

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు (AP Electricity Charges) పై మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ (TDP).. సీఎం జగన్ AP CM YS Jagan) ను అన్నివైపుల నుంచి టార్గెట్ చేస్తోంది.

  ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు (AP Electricity Charges) పై మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ (TDP).. సీఎం జగన్ AP CM YS Jagan) ను అన్నివైపుల నుంచి టార్గెట్ చేస్తోంది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ లోటు రాష్ట్రంగా మార్చారని.. ప్రజల నుంచి వేలకోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన జగన్ అందుకు విరుద్ధంగా, మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని చంద్రబాబు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో ఉన్న విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

  ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారని.. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచి ప్రజలపై పెనుభారం మోపడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారాలు విధించి సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు.., 400 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగం చేసే సంపన్న వర్గాలపై 6 శాతం పెంచి 125 యూనిట్లలోపు వాడే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై 57 శాతం ఛార్జీలు పెంచడమే ఇందుకు సాక్ష్యమన్నారు.

  ఇది చదవండి: ఏపీలో కరెంట్ మంటలు.. పులివెందుల నుంచే మొదలుపెడదామన్న లోకేష్.. జగన్ కు నయా సవాల్..


  2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చార్జీలు పెంచేది లేదని సగర్వంగా ప్రకటించిందని, పైగా పది వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందని ఆయన గుర్తుచేశారు. 2014, నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 14.81 లక్షలు ఉన్న వ్యవసాయ కనెక్షన్లను 2019, మార్చి 31 నాటికి 18.07 లక్షల కనెక్షన్లకు పెంచామని చంద్రబాబు గుర్తుచేశారు.

  ఇది చదవండి: కార్యకర్తలను ఆశ్చర్యపరిచిన టీడీపీ ఎమ్మెల్యే.. ఆ ఆలోచన విరమించుకున్నట్లేనా..?


  టీడీపీ ఐదే ఏళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని.., సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ మూడేళ్లలో ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.17 లక్షలు మాత్రమేనన్నారు. సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం 2018-19లో ఉత్పత్తి సామర్ధ్యం 19,160 మెగావాట్లు ఉండగా.. 2020-21 నాటికి 18,811 మెగావాట్లకు పడిపోయిందన్నారు. SDSTPSలో స్టేజ్-2 లోని ఎనిమిదో యూనిట్ మరో 800 మెగావాట్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసినా జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

  ఇది చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ఎఫెక్ట్.. భూముల ధరలకు రెక్కలు.. అదనపు భారం తప్పదా..?


  ఏపీలో జగ్ అధికారంలోకి వచ్చాక.. సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీశారని.., సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబధించి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచడంతో ఇళ్లల్లో స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: ఒక్కరోజులో రూ.50 లక్షలు ఖర్చు చేయాలి.. లేదంటే అంతా వేస్ట్.. ఇది సినిమా కాదు రియల్..


  2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ప్రారంభమైనా 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామన్నారు. జగన్ అసమర్థత, చేతకానితనంతో మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారని., అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు