AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU SLAMS AP CM YS JAGAN MOHAN REDDY AT MAHANADU 2022 FULL DETAILS HERE PRN GNT
Mahanadu: ముందస్తు ఎన్నికలకు సిద్ధం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
మహానాడులో ప్రసంగిస్తున్న చంద్రబాబు
Mahanadu: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన మహానాడు (Mahanadu-2022) ముగింపు సభలో ప్రసంగించిన ఆయన.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన మహానాడు (Mahanadu-2022) ముగింపు సభలో ప్రసంగించిన ఆయన.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. టీడీపీకి జనముంటే వైసీపీకి బస్సులున్నాయన్నారు. ఈ భారీ సభతో జగన్ కు పిచ్చెక్కుతుందని.., మహానాడుతో సీఎంకు నిద్రపట్టదన్నారు. గడప గడపకూ వైసిపి అన్నారు.. తరువాత గడపగడపకూ ప్రభుత్వం మరి మార్చారని.. పోలీస్ సెక్యూరిటీ కోసమే కార్యక్రమాన్ని మార్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు బస్సు యాత్ర పెట్టుకున్నారు... తరువాత గాలి యాత్ర పెట్టుకుంటారా అని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్న వైసిపి నేతలు భవిష్యత్ లో ఇదే రోడ్ల మీద తిరగాలి అనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్లకు చేరుకున్నాయి...ఈ అప్పులు జగన్ కడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయిందని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా జగన్ ఏడాదికి 5 వేల కోట్లు సొంత ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. మూడేళ్లలో సిఎం జగన్ అక్రమార్జన రూ.1 లక్షా 75వేల కోట్లకు చేరిందన్నారు. జగన్ ఇచ్చేది గోరంత.. పబ్లిసిటీ కొండంతన్న చంద్రబాబు.. జగన్ అన్ని వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని.., సోషల్ మీడియా ద్వారా మీ అభిప్రాయలు చెప్పాలన్నారు.. మీకు కష్టం వస్తే నేను చేసుకుంటానంటూ భరోసానిచ్చారు.
టిడిపి హయాంలో ఒప్పందం చేసుకున్న అదానీ, గ్రీన్ కో వాళ్లతో దావోస్ లో జగన్ కొత్తగా ఒప్పందం చేసుకున్నారని.. అదానీ, గ్రీన్ కో కోసం దావోస్ వరకు వెళ్లాలాని ప్రశ్నించారు. ఇక 300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మఒడి కట్ చేస్తున్నారని.. ఉద్యోగులకు కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. మీడియాను కూడా జగన్ బెదిరించాడని.., కనీసం జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. విభజన కంటే జగన్ రెడ్డి పాలన వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని మండిపడ్డారు.
బాబాయ్ ను చంపి...గొడ్డలి పోటును గుండె పోటుగా చెప్పిన వ్యక్తి జగన్ అని.., ఆ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులనే బెదిరింపులకు గురిచేశారన్నారు. వివేకా హత్య కేసులో భారతీరెడ్డి మేనమామ ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో జగన్ చెప్పిందొకటి చేసిందొకటని.. జగన్ కారణంగా మూడు లక్షల కోట్ల సంపదను కోల్పోయామన్నారు. పోలవరం విషయంలో రివర్స్ టెండర్లు కాదని.,. ప్రాజెక్టులను రివర్స్ లో తీసుకు వెళ్లారని మండిపడ్డారు. టిడిపి వచ్చిన వెంటనే వెలిగొండతో పాటు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు అన్నీ పోయాయని.. కరెంట్ కోతలు మాత్రం ఉన్నాయన్నారు. టిడిపి హయాంలో పోని విద్యుత్ ఇప్పుడు ఎందుకు పోతుందని నిలదీశారు. నాడు ఎన్టీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసేస్తే.. జగన్ మీటర్లు బిగిస్తున్నారన్నారు. మీటర్లకు వ్యతిరేకంగా రైతులు పోరాడితే తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు, రైతులు పోరాడితే తాను అండగాఉంటానని.. అవసరమైతే మీకంటే ముందు నేను జైలుకెళ్తానని చంద్రబాబు అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నవాడు.. ఇప్పుడు తన మెడ వంచుతున్నాడని.. కాళ్లు పట్టుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.