AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU SETS NEW TARGET TO PARTY LEADERS WITH LATEST STRATEGY FULL DETAILS HERE PRN VSP
Chandrababu: ఆ ఏరియా అంతా స్వీప్ చేయాల్సిందే.. నేతలకు చంద్రబాబు కొత్త టార్గెట్..
చంద్రబాబు (ఫైల్)
తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) కొత్తగా ఆలోచిస్తున్నారా... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్రమంగా అడుగులు వేస్తున్నారా అంటే... అవుననే అనిపిస్తుంది పరిస్థితి.
తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కొత్తగా ఆలోచిస్తున్నారా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్రమంగా అడుగులు వేస్తున్నారా అంటే.. అవుననే అనిపిస్తుంది పరిస్థితి. 2019కి ముందుగా ఉన్న బాబు ఆలోచనకు.. ఇప్పటి చంద్రబాబు ఆలోచనకు చాలా తేడా ఉందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తున్నారు. గతంలో చంద్రబాబు చుటూ ఓ కోటరి ఉండేదని.. వారు చెప్పిందే బాబు అమలు చేస్తారనే అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం.. ఆ నలుగురిని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువున్నప్పటికీ ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
40 ఏళ్ల చరిత్రలో తొలిసారి మహానాడు తర్వాత కూడా మినీ మహానాడు పేరుతో జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 స్థానాలకే పరిమితం అయిన టీడీపీ.. 2024 ఎన్నికల్లో (2024 Election) మాత్రం తప్పనిసరిగా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత మాదిరిగా గత ఎన్నికల్లో ఏ జిల్లాల్లో పార్టీ ఓడిందో.. ఇప్పుడు ఆయా జిల్లాలపైనే చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. కానీ 2019లో మాత్రం మూడు జిల్లాల్లో కలిపి కేవలం ఆరు సీట్లు మాత్రమే దక్కాయి. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 2 స్థానాలు మాత్రమే గెలవగా.. విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. విజయనగరం జిల్లాలో అయితే కనీసం ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. వాస్తవానికి తొలి నుంచి టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు అండగా నిలిచాయి. కానీ గత ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో చంద్రబాబు తన ఫోకస్‌ను ఈ సారి ఉత్తరాంధ్రపై పెట్టినట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan). పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. తొలి నాళ్లల్లో ఉత్తరాంధ్రలో జగన్ నిర్ణయానికి ఆ ప్రాంత వాసులు బ్రహ్మరథం పట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన చంద్రబాబును విశాఖలో అడ్డుకున్నారు కూడా. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా మూడు రాజధానుల ప్రక్రియకు బ్రేకులు పడింది. దీంతో మూడేళ్లుగా ఉత్తరాంధ్ర వాసులకు జగన్ ఏం చేయలేదని టీడీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజధానుల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే మళ్లీ బలపడేందుకు బాబు ప్లాన్ వేస్తున్నారు.
అందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. ఇక తొలిసారి నిర్వహిస్తున్న మినీ మహానాడు సభలను కూడా అరకు జిల్లా చోడవరంతోనే ప్రారంభించారు. ఆ తర్వాత కూడా అనకాపల్లి, చీపురుపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అలాగే అనకాపల్లిలో ఉత్తరాంధ్ర జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. మరి బాబు ఉత్తరాంధ్ర ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.