Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU PLANNING TO SHIFT HIS ADDRESS TO KUPPAM SOON FULL DETAILS HERE PRN TPT

Chandrababu: మారనున్న చంద్రబాబు అడ్రస్.. ఇకపై అక్కడి నుంచే రాజకీయం.. కారణం ఇదేనా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా పేరొందిన టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుప్పం ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు సరికొత్త ప్రణాళికలతో రచిస్తున్నారు.

    GT Hemanth Kumar, News18, Tirupati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా పేరొందిన టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుప్పం ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు సరికొత్త ప్రణాళికలతో రచిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన స్ధానం సంపాదించుకున్నారు ఆయన.. రాజకీయాల్లో నలబై సంవత్సరాల అనుభవం, రెండు దఫాలుగా సీఎంగా, 14 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం కుప్పం భయం పట్టుకుంది.. నియోజకవర్గంలో సొంత ఇళ్ళు కూడా నిర్మించుకోలేని స్ధితిలో ప్రతిపక్షనేత ఉన్నాడని అధికార పార్టి నాయకులు రాద్దాంతం చేశాయి.‌ అధికార పార్టి నేతలకు బుద్ది చేప్పే విధంగా ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇకపై కుప్పం వాసిగా మారబోతున్నారు.

    ఆరుసార్లు కుప్పం ప్రజలను నమ్ముకుని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పని చేసిన బాబుకు ఇప్పటి వరకూ సొంత ఇల్లు లేదు. దీంతో ఆయన కుప్పంలో ఇంటి నిర్మాణం వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని పనులు చకచక సాగుతున్నాయి. ఇన్నాళ్ళుగా కుప్పం నియోజకవర్గంకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని అధికార పార్టి నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంను అస్త్రంగా చేసుకున్న కొందరు అధికార పార్టి నాయకులు కుప్పం ప్రజలను చంద్రబాబుకు దూరం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అధికార పార్టి నాయకులకు తమదైన స్టైల్ లో చంద్రబాబు సమాధానం ఇస్తూ వచ్చారు.. అయితే గత ఎన్నికల తరువాత ఈ అంశం బాగా ప్రచారం కావడం, ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రతికూలంగా మార్చుకున్నారు.

    ఇది చదవండి: రోజా ఆ పనిచేస్తే ఇక తిరుగుండదు..! చరిత్రలో నిలిచిపోవడం ఖాయం..!


    ఏళ్ళ తరబడి కుప్పం ప్రజలతో చంద్రబాబు నాయుడుకి ఎంతో అనుబంధం ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పనక్కల లేదు.. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పంగా రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ నానుడి.. అందుకే ఇకపై తనే ప్రజలకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్న బాబు కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని రోడ్డు ప్రక్కనే భూమిని కొనుగోలు చేశారంటా.. అంతే కాకుండా కొనుగోలు చేసిన భుమిలో ఇంటిని నిర్మించనున్నారు.‌ ఈ నెల చివరిలో కుప్పం పర్యటన ఖరారు చేసిన బాబు.. పర్యటన అనంతరం ఈ తతంగాన్ని పూర్తి, భూమి పూజ చేసి ఇంటి పనులు ప్రారంభించనున్నారు.

    ఇది చదవండి: ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు..? అధిష్ఠానానికి పీకే సూచన.. జగన్ ఒప్పుకుంటారా..?


    అంతేకాకుండా ఇంటి నిర్మాణంతో పాటుగా కుప్పం రాజకీయాలపై కూడా బాబు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.‌ తమ కుటుంబంలో ఒకరిని ఇక్కడ పెట్టి పార్టి వ్యవహాలను స్వయంగా చూడనున్నారంట. ఇంత వరకూ కుప్పం భాధ్యతలను పీఏలకు అప్పగించిన బాబు ఇకపై వారిపై ఆధారపడకుండా పర్సనల్ గా ప్రజలతో టచ్ లో ఉండేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తొంది. కుప్పం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనే ఆ సమస్యను నేరుగా పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు.

    ఇది చదవండి: ఆ పథకాలన్నింటికీ బ్రేక్.. వారి లక్ష్యం అదే.. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు..


    ప్రతిపక్ష నాయకుడిగా భాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా ఉండే బాబు కుప్పం భాధ్యతలను స్ధానిక పార్టి నాయకులపై ఉంచారు.‌ అయితే ఇటీవల్ల ఎదురైన పరిమాణాల దృష్ట్యా అధికార పార్టి నాయకులకు తలొగ్గారంటూ చంద్రబాబు స్ధానిక నాయకులపై తీవ్రంగా మండిపడ్డిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుప్పం ప్రజలకు దగ్గర అయ్యే విధంగా చంద్రబాబు యోచించడంతో మరింతగా కుప్పం టిడిపి వర్గాల్లో కొత్త ఊపు రానుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Chandrababu Naidu, Kuppam, TDP

    తదుపరి వార్తలు