Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU PLANNING FOR STATE WIDE TOURS AFTER MAHANADU SUCCESS FULL DETAILS HERE PRN GNT

Chandrababu: ఇకపై తగ్గేదేలే..! నెలకు రెండు టూర్లు.. అదే నినాదంతో ముందుకు.. బాబు ఎలక్షన్ ప్లాన్ ఇదే..!

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

మహానాడు ఇచ్చిన జోష్ తో టీడీపీ (TDP) ఎలక్షన్స్ ప్లాన్ రెడీ చేస్తోంది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ (Nara Lokesh) రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధముతున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రపై హింట్ ఇవ్వగా.. చంద్రబాబు కూడా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహానాడు సక్సెస్ పై చంద్రబాబు స్పందించారు.

ఇంకా చదవండి ...
    మహానాడు ఇచ్చిన జోష్ లో టీడీపీ (TDP) ఎలక్షన్స్ ప్లాన్ రెడీ చేస్తోంది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ (Nara Lokesh) రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధముతున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రపై హింట్ ఇవ్వగా.. చంద్రబాబు కూడా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహానాడు సక్సెస్ పై చంద్రబాబు స్పందించారు. మహానాడు ప్రజా విజయమని చంద్రబాబు (Nara Chandrababu Naidu) అన్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు. ప్రభుత్వ అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదికయిందని చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఎప్పుడో ఈ స్థాయిలో మహానాడు జరిగేదని... ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో మహానాడు జరిగిందని చంద్రబాబు అన్నారు. క్యాడర్లో వచ్చిన జోష్, ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని తదుపరి కార్యక్రమాలు ఉండాలని చంద్రబాబు నేతలతో అన్నారు. మహానాడు వేదికగా ప్రకటించినట్లు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాలలో తాను పర్యటిస్తానని చంద్రబాబు తలిపారు. ఇకపోతే ఇప్పటికే మొదలు పెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

    క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని చంద్రబాబు మండి పడ్డారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని... యువత భవిష్యత్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే సమాజానికి నష్టం తప్ప ఎటువంటి లాభం ఉండదని అన్నారు. కొత్త ఓట్ల నమోదు, ఒట్ల తొలగింపు వంటి అంశాల్లో నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.

    ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


    వైసిపి పాలనలో వైఫల్యాలను చాటేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచెయ్యాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఆయా రంగాలల్లో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ను చాటేలే కార్యక్రమాలు ఉండాలని సూచించారు. మహానాడు విజయవంతం లో భాగస్వాములు అయిన నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఊహించని స్థాయిలో జనం వచ్చినా కష్టపడి ఏర్పాట్లు చేశారని.. సభను విజయవంతంగా నిర్వహించారని నేతలను చంద్రబాబు అభినందించారు.

    ఇది చదవండి: ర‌ఘురామ‌ కృష్ణంరాజు కుర్చీ వెనుకున్న కండువా క‌థేంటీ..? ఆ పార్టీకి సంకేతాలిస్తున్నారా..?


    అచ్చెన్నాయుడు, లోకేష్ తో సహా కిందిస్థాయి వరకు పార్టీ నేతలు అంతా ఎంతో సమన్వయంతో పనిచేశారని అన్నారు. అంతపెద్ద కార్యక్రమం జరుగుతుంటే పోలీసు శాఖ కనీస మాత్రం సహకరించలేదని నేతలు చెప్పారు. అయినా ఎక్కడా కార్యక్రమం గాడి తప్పకుండా.. పార్టీ వాలంటీర్ల ద్వారానే సభను నిర్వహించామని నేతలు చెప్పారు. మమహానాడు సక్సెస్ ను పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని నేతలు వివరించారు. సాధారణంగా ఎన్నికలకు 6 నెలల ముందు ఈ స్థాయి స్పందన ఉంటుందని.. అయితే రెండేళ్ల ముందు ఇంత భారీగా మహానాడు జరగడాన్ని ప్రత్యేకంగా చూడాలని నేతలు అభిప్రాయపడ్డారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు