Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU MADE SENSATIONAL COMMENTS ON YS VIVEKA MURDER CASE FULL DETAILS HERE PRN

Chandrababu: వివేకా హత్య కేసులో మేం చెప్పినట్టే జరుగుతోంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో మొదటి నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy Murder Case) హత్య కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో మొదటి నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిటాల రవి హత్య కేసులో జరిగిన సంఘటనలే మళ్లీ పునరావృతం అవుతున్నాయని.. వివేకా హత్య కేసులో తాము చెప్పినట్టే జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు విలేకర్ల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ నేతలు మూడేళ్లలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారంటూ విమర్శించారు. ప్రభుత్వంలోని సామాన్యులపై జరుగుతున్న అఘాయిత్యాలను గుర్తించి చర్యలు తీసుకునే స్థితిలో జగన్ లేరంటూ ప్రతిపక్ష నేత ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ ఆయన కోరారు.

    ఇది చదవండి: పన్నుల వసూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. మరోసారి ఓటీఎస్ సిస్టమ్.. వివరాలివే..!


    వివేకా హత్య కేసు సంబంధీకులను ఒక్కొక్కరిగా చంపేస్తారని ముందు నుంచే చెబుతున్నామని.. అంతా మేం చెప్పినట్టే జరుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి విషయంలోనూ ఇలానే చేశారని.. వీళ్లంతా కరుడుగట్టిన నేరగాళ్లంటూ ఆరోపించారు. సీబీఐకే సమర్థత లేకపోతే దేశాన్ని ఇంకెవరు కాపాడతారని.. గంగాధర్ రెడ్డి మరణం సీబీఐ విశ్వసనీయతకే పెను సవాల్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఇది చదవండి: వల్లభనేని వంశీ, కొడాలి నాని జూమ్ ఎంట్రీపై క్లారిటీ.. అందుకే వచ్చారన్న విజయసాయి రెడ్డి


    అయితే, వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి బుధవారం రాత్రి మరణించారు. అనంతపురం జిల్లా యాడికిలో నిద్దరలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.



    వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డికి గంగాధర్ రెడ్డి అనుచరుడు. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో స్థిరపడ్డాడు. అయితే, వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించిందని.. నిందితుల పేర్లు చెప్పాలంటూ బెదిరించారని ఆయన గతంలో పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలంటూ రెండుసార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు