Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU MADE SENSATIONAL COMMENTS ON AP CM YS JAGAN IN KADAPA TOUR FULL DETAILS HERE PRN GNT

Chandrababu: చెల్లెళ్లని మోసం చేసి వ్యక్తి ప్రజలకు మంచి చేస్తాడా..? సీఎం జగన్ పై చంద్రబాబు హాట్ కామెంట్స్...

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

కడప జిల్లా (YSR Kadapa District) పర్యటనలో ఉన్న టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీఎం జగన్ (AP CM YS Jagan) పై ఘాటు విమర్శలు చేశారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేనివాడు మూడు రాజధానులు నిర్మిస్తారా అని ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి ...
  కడప జిల్లా (YSR Kadapa District) పర్యటనలో ఉన్న టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీఎం జగన్ (AP CM YS Jagan) పై ఘాటు విమర్శలు చేశారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేనివాడు మూడు రాజధానులు నిర్మిస్తారా అని ఎద్దేవా చేశారు. మూడేళ్ల జగన్ పాలన పూర్తివైఫల్యంగా సాగిందని.. మూడేళ్లలో విధ్వంసం, పన్నుల భారం తప్ప మరేదీ లేదన్నారు. అందరిపై బాదుడే బాదుడు పేరుతో మోయలేని భారం వేశారని మండిపడ్డారు. ఒంగోలులో మహానాడుకు స్టేడియం ఎందుకు ఇవ్వలేదని.. మీ అబ్బసొత్తు కాదంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు. కడప ఎయిర్ పోర్ట్ దగ్గర కార్యకర్తలపై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టారని.., తాను ప్రజాస్వామ్య వాదినని., నేను నాడు అనుకుని ఉంటే జగన్ ఇడుపులపాయ దాటేవారా? అని ప్రశ్నించారు.

  ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. దీన్ని ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి నియంతలకు భయపడేది లేదన్న చంద్రబాబు.., మూడేళ్ల ఏళ్ల పాలనలో కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టరా..? ఒక్క ప్రాజెక్ట్ కట్టారా..? ఒక్క పరిశ్రమ తెచ్చారా..? అని ప్రశ్నించారు. బాదుడే బాదుడు నిరసనలు చేస్తున్నా జగన్ సిగ్గు పడడం లేదన్నారు చంద్రబాబు.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పవర్ హాలిడే ఎత్తివేత.. ఇకపై నాన్ స్టాప్ పవర్..


  కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో వచ్చిందని.., ఆ ప్రాజెక్ట్ విషయంలో తమపై ఆరోపణలు చేసి కంపెనీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు అదే సంస్థను ప్రారంభించారని విమర్శించారు. మూడేళ్ల క్రితం కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తై ఉంటే ఈ రోజు పవర్ కష్టాలు ఉండేవి కాదన్నారు. చిరు వ్యాపారులు చిన్న బోర్డ్ పెట్టుకున్నా పన్నులు వేస్తున్నారని., కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వాస్తవాలు చెప్పి ప్రభుత్వ దోపిడీని వివరించాలన్నారు.

  ఇది చదవండి: కోనసీమ జిల్లా పేరు మార్పు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పేరు ఇదే..


  దొంగ లెక్కలు రాయడం.. అడ్డంగా దొరికిపోవడం జగన్ తీరని.., నాడు రోడ్ల మీద ముద్దులు., ఇప్పుడు ఫ్రీ గా గుద్దులు ఇస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు టీడీపీ ఫౌండేషన్ వేస్తే.. పక్కనే జగన్ మరోసారి పునాదిరాయి వేశారని ఆరోపించారు. జగన్ ఫౌండేషన్ వేయడానికి బదులు ప్రారంభం చేసి ఉంటే బాగుండేదన్నారు. వివేకా ను హత్య చేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని.., నారాసుర రక్త చరిత్ర అని తమపై బురద జల్లారన్నారు. చెల్లెళ్ళ ను మోసం చేసిన వ్యక్తి జగన్ అని.., సీఎం అండ లేకుండా సీబీఐ అధికారుల డ్రైవర్ లను బెదిరించ గలరా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో చెలరేగుతున్న సైకోలకు వడ్డీ తో సహా చెల్లిస్తానంటూ హెచ్చరించారు.

  ఇది చదవండి: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచ‌న‌లో అలీ..? కారణం ఇదేనా...?


  రాజ్యసభ ఇచ్చిన వాళ్ళలో ఇద్దరు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళేనని.., సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్న వారికి జగన్ రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు. ఏపీలో రాజ్యసభ ఇవ్వడానికి సమర్థులు, వెనుకబడిన వర్గాల వారు లేరా? అని ప్రశ్నించారు. వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లను కట్టించలేని వ్యక్తి 30లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని జగన్ నిలదీశారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Kadapa

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు