Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU MADE HOT COMMENTS ON NEW DISTRICTS AND STATE FINANCIAL STATUS FULL DETAILS HERE PRN

Chandrababu: జగన్ పై రెడ్లే తిరుబాటు చేస్తారు.. ఏపీ మరో శ్రీలంక కావడం ఖాయం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఏపీలో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు నేపథ్యంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని పెంచాయి. రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడగా.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
    ఏపీలో కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు నేపథ్యంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని పెంచాయి. రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడగా.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చారాయన. సీఎం జగన్ విజగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా అయ్యే ప్రమాదముందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలు రాష్ట్ర పరిస్థితికి దర్పణమని అబిప్రాయపడ్డారు. ఏపీలో జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ సరిదిద్దుతామన్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు.

    కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కరెంట్ ఎందుకు పోతోందో...బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే...ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారన్నారు. అమరావతిలో 80 శాతం పూర్తి అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్...ఇప్పుడు మరో 5 ఏళ్లు సమయం కోరడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇది చదవండి: ‘ఆ బాధ్యత జనసేనదే..’ కొత్త జిల్లాలపై పవన్ కీలక వ్యాఖ్యలు..


    వ్యక్తిగత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని.., సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందన్నారు. జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.., జగన్ కు ఓటేసి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ విషయంలో ఆందోళనలు చేస్తున్నవారికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

    ఇది చదవండి: కుప్పం ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ పనిచేశాం.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..


    వైజాగ్ లో జరిగిన ల్యాండ్ స్కామ్ ను, దేవాలాయాలపై దాడులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. విశాఖ మధురవాడలో ఐటీ హిల్స్ నందు రూ.1,550 కోట్ల విలువ చేసే భూదందాకు ఏ2 విజయసాయిరెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం ద్వారా సీఎం జగన్ వేల కోట్లు ఆర్జిస్తున్నారని.. ప్రభుత్వ లిక్కర్ షాపుల ద్వారానే నెంబర్ 2 మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కల్తీమద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు