హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: ఇలాగైతే గెలవడం కష్టమే.. ఇకనైనా మారండి..! కీలక జిల్లా నేతలకు చంద్రబాబు క్లాస్..

TDP: ఇలాగైతే గెలవడం కష్టమే.. ఇకనైనా మారండి..! కీలక జిల్లా నేతలకు చంద్రబాబు క్లాస్..

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం (Telugu Desham Party) లో చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టాలంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) చాలా ముఖ్యం. కానీ అక్కడి టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయట్లదనేది చంద్రబాబు (Chandrababu) అభిప్రాయం.

ఇంకా చదవండి ...

  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం (Telugu Desham Party) లో చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టాలంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) చాలా ముఖ్యం. కానీ అక్కడి టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయట్లదనేది చంద్రబాబు (Chandrababu) అభిప్రాయం. ఈ విషయన్ని సదరు నాయకుల ముందే కుండ బద్దలు కొట్టేశారట. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో ఇప్పటికే బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్గ సమావేశంలో తమ్ముళ్లకి చంద్రబాబు స్వీట్ వ వార్నింగ్ ఇచ్చేశారు. సరిగ్గా పనిచేయపోతే ఇకపై పార్టీలో కొనసాగడంపైనే అనుమానాలు ఉంటాయని ఆయన తెగేసి చెప్పినట్టే తెలుస్తోంది. కాకినాడ కేంద్రంగా జరిగిన ఓ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ స్టేట్ మొత్తానికి వర్తిస్తుందట.

  "ప్రతిపక్షంలో ఉన్నాం. నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేయాలి. కానీ ఆ దిశగా నేతలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రజల్లో పార్టీ బలం పుంజుకున్నా నేతల్లో మాత్రం ఐక్యత ఉం డడంలేదు. ఇది సరికాదు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలి. లే దంటే కఠినంగా వ్యవహరిస్తా’ అంటూ టీడీపీ అధినేత చంద్ర బాబు కాకినాడ సిటీ నియోజకవర్గ సమీక్షలో నేతలపై మండిపడ్డారు.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికీ ప్రత్యేక సౌకర్యాలు.. త్వరలో మెట్లమార్గం రీ ఓపెన్..


  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా నేత పంచుమర్తి అనురాధ, ఇతర జిల్లా పర్యవేక్షకులు, నేతల సమక్షంలో కాకినాడ సిటీ ని యోజకవర్గ నేతల పనితీరుపై చం ద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీలో అంతర్గత విభేదాలతో నేతలు కొట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. విభేదాలు వీడి అంతా కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, లేదంటే నష్టపోతామని హెచ్చరించారు. కాకినా డ సిటీలో తామంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నామని, మాజీ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఓ నేత చంద్రబాబు కు బుదులిచ్చే ప్రయత్నం చేయగా దీనిపై అధినేత మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రంజాన్ హాలిడేపై ప్రభుత్వం కీలక ప్రకటన..


  పార్టీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నియోజవర్గంలో ఎన్నిసార్లు నిర్వహిం చారని ప్రశ్నించగా నేతలు నీళ్లు నమిలారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు మునుపటి స్థాయిలో గట్టిగా పొరాడడంలో కొంత వెనుకబడ్డారని ఈ సందర్భంగా అధినేత చురకలంటించారు. ఒకప్పటి కొండబాబు పోరాటాలకు, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. మట్టి మాఫియా, అడ్డగోలు బియ్యం వ్యాపారం, గోదాములకు పన్ను రాయితీ పొందడం తదితరఅంశాలపై ఎమ్మెల్యే అధికారం అడ్డం పెట్టు కుని చెలరేగిపోతున్నా పార్టీ తరఫున దీటుగా పోరాటం చేయడం లేదన్నారు.

  ఇది చదవండి: జనసేన కొత్త స్ట్రాటజీ.. ముల్లును ముల్లుతోనే తీయాలంటున్న పవన్.. సైనికులదీ అదే మాట..


  అయితే ఇవన్నీ అంటునే చంద్రబాబు స్థానిక నాయకత్వం బలంగా తయారవ్వాలని సూచించారు. అలాగే పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం తథ్యంగా చెప్పారు. కానీ.. అందుకే టీడీపీ కార్యకర్తలు.. నాయకులు అందరూ గట్టిగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. మరి అధినేత అంతగట్టిగా చెప్పడంతో నాయకత్వం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలంటున్నాయి శ్రేణులు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, TDP

  ఉత్తమ కథలు