Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF NARA CHANDRABABU NAIDU CONFIDENT ON ELECTIONS AS HE SLAMS CM YS JAGAN MOHAN REDDY FULL DETAILS HERE PRN GNT

Chandrababu: ఇకపై వార్ వన్ సైడే.. గ్రూపులు కడితే గెట్ ఔట్.. చంద్రబాబు కామెంట్స్

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలెప్పుడు జరిగినా వార్ వన్ సైడేనని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనతో వైసీపీ పనైపోయిందన్న ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలెప్పుడు జరిగినా వార్ వన్ సైడేనని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనతో వైసీపీ పనైపోయిందన్న ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. మహానాడు సక్సెస్, సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ పైనా ఈ సందర్భంగా వివరించారు. మహానాడు ఈ స్థాయిలో విజయవంతం అవ్వడానికి గల కారణాలు కూడా నేతలకు చంద్రబాబు వివరించారు.

    మూడేళ్ల అణిచివేత తో కార్యకర్తల్లో ఉన్న కసి.. పాలకుల నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని చంద్రబాబు తెలిపారు. కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారని చంద్రబాబు అన్నారు. సొంతగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో జనం రావడం రాష్ట్రంలో రాజకీయంగా వచ్చిన మార్పుకు నిదర్శనమన్నారు.

    ఇది చదవండి: టీడీపీకి ఊహించని షాక్.. మహానాడు తర్వాత కీలక నేత రాజీనామా..


    వైసిపి నిర్వహించిన బస్సు యాత్రకు జనం లేక వెలవెల పోతే.. మహానాడు దగ్గర కంట్రోల్ చెయ్యలేని స్థాయిలో జనం తరలిరావడం టిడిపి పై నమ్మకాన్ని చాటుతోందని చంద్రబాబు అన్నారు. గడప గడపకూ వైసిపిని.., గడప గడపకూ మన ప్రభుత్వం అని మార్చారని... అయినా వ్యతిరేక స్పందన రావడంతో...మళ్లీ బస్సు యాత్ర పెట్టారని వ్యాఖ్యానించారు. బస్సు యాత్ర కూడా ఎలా ఫెయిల్ అయ్యిందో రాష్ట్ర ప్రజలు చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగించాలి అని సూచించారు. మెంబర్ షిప్ డ్రైవ్ కూడా వేగవంతం చెయ్యాలని చంద్రబాబు సూచించారు.

    ఇది చదవండి: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..?


    తెలుగుదేశంలో పార్టీ కమిటీల నియామకంపైనా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలని చెప్పారు. ఇదే సమయంలో పార్టీలో ఏ స్థాయిలోను గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూపులు కట్టే వారి విషయంలో కఠినంగా ఉంటానని...ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక కార్యకర్తలు ఒంటరి వారు కాదన్న చంద్రబాబు.. వారికి కష్టం వస్తే పార్టీ చూసుకుంటుందని వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు పెంచాలని సూచించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు