హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CBN Slams Jagan: “కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకే లేదు..” ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

CBN Slams Jagan: “కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకే లేదు..” ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

చంద్రబాబు ఫైల్...

చంద్రబాబు ఫైల్...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విధ్వంసకర పాలన సాగుతోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chanrababu Naidu) మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని ఆయన ఆరోపించారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విధ్వంసకర పాలన సాగుతోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chanrababu Naidu) మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారన్న చంద్రబాబు.. ,రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారని.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు 50 వేల ఎకరాల భూములిచ్చారని.. రాజధాని కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్‌ ఉండేదా?. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

    కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరమన్న చంద్రబాబు... అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారని.. పోలవరం పూర్తి చేయడం మీకు చేతనవుతుందా..? అని ప్రశ్నించారు. పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఉందా.. అని నిలదీసిన చంద్రబాబు.. ఏపీకి ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదన్ని ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: ఏపీలో భారీగా పెరిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ ముంచుకొస్తోందా..?


    తమ హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశాంమని.. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అని చంద్రబాబు అన్నారు. దేశానికి అన్నంపెట్టిన ఏపీలోనే వరి వేయొద్దనే పరిస్థితి వచ్చిందని.. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని మండిపడ్డారు. ఇంగ్లీష్‌ మీడియం అన్నారు, నాడు- నేడు అన్నారు.. టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్... జాబ్ లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: కేంద్ర మంత్రులతో వైఎస్ జగన్ వరుస భేటీలు.. వాటిపైనే ఏపీ సీఎం ఫోకస్


    ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని... ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగుతున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసేది నవరత్నాలు కాదని.. టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చిందని బాబు చెప్పారు. పన్నుల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారం మోపారని.. చెత్తమీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. రెండేళ్లలో కరెంట్‌ ఛార్జీలను ఆరుసార్లు పెంచినట్లు గుర్తుచేశారు.

    ఇది చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. 10 రోజుల పాటు వాటికి బ్రేక్.. భక్తుల కోసమేనన్న అధికారులు


    రాష్ట్రంలో మద్యంపై పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారని.. మద్యపాన నిషేధ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్కరోజే రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు చేశారంటేనే పరిస్థితి అర్ధమవుతోందన్నారు. ఇసుక, ఓటీఎస్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారని.. డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. ప్రపంచాన్ని కరోనా నాశనం చేస్తే.. ఏపీని జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. కరోనాకు వ్యాక్సిన్ ఉందకానీ.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదన్నారాయన.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu

    ఉత్తమ కథలు