హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబు అలర్ట్.. నేతలతో ప్రత్యేక సమావేశం.. వెళ్లేది ఎవరు..?

Chandrababu: కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబు అలర్ట్.. నేతలతో ప్రత్యేక సమావేశం.. వెళ్లేది ఎవరు..?

కేసీఆర్ తో చంద్రబాబు (పాత ఫొట)

కేసీఆర్ తో చంద్రబాబు (పాత ఫొట)

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ హాట్ టాపిక్ అవుతోంది.. అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ మంత్రులు వరుస పెట్టి.. బీఆర్ఎస్ పై కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తెలుగు దేశం పార్టీ సైతం అలర్ట్ అయ్యింది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నది ఎవరు అన్నదానిపై అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Chandrababu: తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) జాతీయ పార్టీ బీఆర్ఎస్ (BRS) రచ్చ ఏపీలోనూ మొదలైంది.. నేరుగా కేసీఆర్ ఏపీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. చర్చ మాత్రం ఆగడం లేదు. సంక్రాంతి సమయంలో విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) జిల్లాల్లో భారీగా బహిరంగ సభ నిర్వహించునున్నారు. అంతకుముందే ఏపీ నుంచి బీఆర్ఎస్ చేరికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నేతలను కేసీఆర్ టీం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా ముందే అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. వైసీపీ (YCP) మంత్రులు అయితే వరుస పెట్టి.. అంతా లైన్ గా గా బీఆర్ఎస్ పై స్పందిస్తున్నారు. ఆ పార్టీతో అసలు మతకు సంబంధం లేదని.. ఆ ప్రభావం ఏపీపై ఏ మాత్రం ఉండదని.. లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చూస్తే.. వైసీపీ నుంచి కేసీఆర్ పార్టీ వైపు చూసే నేతలు లేరనే చెప్పాలి.. దీతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి ఏపీలో అధికార పార్టీకి ఎలాంటి ముప్పు లేనట్టే..

  ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మాత్రం తలనొప్పి తప్పకపోవచ్చు.. రెండు రకాలుగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది అధికార పార్టీకి ప్లస్సే అవుతుంది. నేరుగా ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలే ప్రమాదం ఉంటుంది.. దీంతో పాటు మరో ప్రమాదం కూడా టీడీపీకి పొంచి ఉంది..

  ఎందుకంటే టీడీపీని సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారనే ప్రచారం కూడా ఉంది. గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు..? నిజంగానే కేసీఆర్ టీతో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారా..? వచ్చే ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందా..? ఒకప్పుడు ఆంధ్రా పాలకులపై తిట్ల దండకం వినిపించిన.. కేసీఆర్ వెంట నడిచేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపిస్తారా..? అలా వెళ్తే వారికి రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..

  ఇదీ చదవండి : తిరుమలలో కన్నుల పండుగగా బాగ్ స‌వారి.. ఎందుకు చేస్తారు..? ప్రత్యేకత ఏంటి..?

  మునుగోడు ఎన్నికల తరువాత.. ఏపీపై కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ లోపు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే బాధ్యతను మంత్రులకు అప్పచెప్పినట్టు టాక్.. ముఖ్యంగా శ్రీకాకుళం , విజయనగరం , కడప జిల్లాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరాలంటూ ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ నుంచి కబురు వెళ్లినట్లుగా సమాచారం. గత లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా సాగుతున్నట్లుగా సమాచారం.

  ఇదీ చదవండి : ఆశాజనకంగా ఆర్థిక ప్రగతి.. ఆదాయ మార్గాలు పెచ్చడంపై శ్రద్ధ పెట్టాలన్న సీఎం జగన్

  ఈ వార్తల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో పార్టీ కీలక నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నది ఎవరు..? టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఎవరు అనుకుంటున్నారు..? రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా..? అది నిజమైతే ఎలా ముందుకు వెళ్లాలి.. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి.. వైరం పెట్టుకోవాలా..? లేక స్నేహభావంగా ఉంటే మంచిదా.. ఇలా పలు అంశాలపై ఆయన కీలక నేతలతో చర్చించే అవకాశం ఉంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, CM KCR, KCR New Party, TDP

  ఉత్తమ కథలు