Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABAU NAIDU SLAMS TO CM YS JANAG IN ANAKAPALLI DISTRICT NGS VSP

Chandrababu Naidu: జగన్ సర్కార్ పై ప్రజా తిరుగుబాటు మొదలైంది..! సమరానికి సై అన్న చంద్రబాబు

జగన్ సర్కార్ పై తిరుగుబాటు

జగన్ సర్కార్ పై తిరుగుబాటు

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రోజు రోజుకూ దూకుడు పెంచుతున్నారు. ఓ వైపు పార్టీ కేడర్ ను ఉత్సాహ పరుస్తూనే.. మరోవైపు సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆయన.. జగన్ సర్కార్ పై జనంలో తిరుగుబాటు మొదలైంది అన్నారు. ఇంకా ఏమీ అన్నారంటే..?

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu).. గేరు మార్చారు. గతంలో కంటే దూకుడు గా దూసుకుపోతున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయని గట్టిగా నమ్ముతున్న ఆయన.. ఆ దిశగా కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలక జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తూ ఆయ జిల్లాల్లో పరిస్థితులపై కన్నేస్తున్నారు. అదే సమయంలో అధికార వైసీపీ, సీఎం జగన్ (CM Jagan) తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో రెండురోజుల టూర్ కోసం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లిలో నిర్వహించిన మినీమహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్పూర్తి, చంద్రన్న భరోసా పేరుతో నిర్వహిస్తున్న మినీ మహానాడులకు చంద్రబాబు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

  రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు బాధితులైన వారంతా తిరుగుబాటుకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలాచోట్ల జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉంది అంటున్నారు. ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం వచ్చిందని, కానీ జగన్ సర్కార్ జనాల్ని బెదిరిస్తోందన్నారు. ఎన్డీఆర్ పెట్టిన టీడీపీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా బెబ్బులి పులిలా గాండ్రిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. చోడవరం సభతో వైసీపీ సర్కార్ పతనం ప్రారంభమైందన్నారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం పచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ దొంగల్ని హెచ్చరిస్తున్నానని, మీరు జాగ్రత్తగా ఉండకపోతే శాస్తి చేసి సత్తా ప్రజలకు ఉందన్నారు.

  ఇదీ చదవండీ: ఫలించిన ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం.. ఎట్టకేలకు పోస్టింగ్.. ఏ పదవి ఇచ్చారంటే..?

  ఇలాంటి మహానాడుల్ని ప్రతీ జిల్లాలోనూ పెడతామని అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ను నెమరువేసుకుందామని, టీడీపీ చేసిన పనుల్ని జ్ఞాపకం చేసుకుందామని చంద్రబాబు అన్నారు. టీడీపీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎక్కడున్నా పోరాడతామన్నారు. టీడీపీ ఏమిచ్చింది, రాష్ట్రానికి ఏమి తెచ్చిందో ఆలోచించాలని ప్రజల్ని చంద్రబాబు కోరారు. జిల్లాల్లో 15 రోజులకో మహానాడు పెడతామని, అందులో స్ధానిక సమస్యలపై చర్చిస్తామన్నారు.  అలాగే బీసీలకు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే అన్నారు. సామాజిక న్యాయం గురించి వైసీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. బీసీలైన అయ్యన్నపాత్రుడు, సత్యనారాయణమూర్తికి పదవులు ఇచ్చామని, ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రి చేశామని చంద్రబాబు గుర్తు చేసారు. ఇవాళ ఉత్తరాంధ్రలో ఎవరు పెత్తనం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ2 విశాఖను దోచేశాడని చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, వైసీపీకి భయం పుట్టుకుందన్నారు. విశాఖను రాజధాని చేస్తానన్న జగన్.. ఒక్క తట్ట మట్టి ఎత్తలేదన్నారు.

  ఇదీ చదవండీ: బాబోయ్ బెంగాల్ టైగర్.. మళ్లీ వచ్చింది.. గేదెలపై దాడి.. ఆ ప్రాంతంలో భయం భయం..

  చోడవరానికి వచ్చిన రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని చంద్రబాబు అన్నారు. కనీసం రోడ్లలో గుంతలకు మరమ్మతు చేయలేని సీఎం జగన్ మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎప్పుడూ చెత్తమాటలు, ఫేక్ న్యూస్ మాట్లాడతారన్నారు. కిలోమీటరుకు 150 గుంతలున్నాయన్నారు. ఆటోడ్రైవర్లందరూ కోపంగా ఉన్నారన్నారు. రిపేర్లకే వచ్చే ఆదాయం సరిపోతుందన్నారు. పెట్రోల్, డీజిల్ పెరిగాయి, రోడ్లు గుంతలు కూడా పూడ్చరని చంద్రబాబు విమర్శించారు. పదో తరగతి ఫలితాలపై పదో తరగతి పరీక్షల్లో ఫలితాలు చూస్తే అమ్మఒడి, నాడు నేడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టినప్పుడే అంతా అయిపోయిందన్నారు. అడిగితే గుజరాత్ లోనూ అలాగే ఉందని చెప్తున్నారన్నారు. మొత్తం విద్యావ్యవస్ధను నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు