Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU WILL GOES VIZIANAGARAM AFTERS SUCCESS OF MAHA NADU NGS VZM

Chandrababu: నేడు విజయనగరంలో చంద్రబాబు టూర్.. టార్గెట్ అదేనా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrabau Naidu: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయడు పూర్తి దూకుడుగా ఉన్నారు. వరుస జిల్లా పర్యటనలతో కేడర్ లో జోష్ పెంచుతున్నారు. పర్యటనల్లో ప్రజా స్పందన భారీగా వస్తుండడంతో మరింత స్పీడ్ గా దూసుకువెళ్తున్న ఆయన.. ఇవాళ విజయనగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు..

ఇంకా చదవండి ...
    Chandrababu Niadu Vizianagaram Tour:  తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. జిల్లాల పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన.. ఇప్పటికే విశాఖ (Visakha), అనకాపల్లి (Anakapalli) నియోజకవర్గాలపై పోకస్ చేసి.. అక్కడి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నేరుగా ఇవాళ విజయనగరం (Vizianagaram) చేరుకోనున్నారు.  గురువారం రాత్రికే విజయనగరం జిల్లా భోగాపురం లోని సన్ రే రిసార్ట్స్ కు చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం నుండే నియోజకవర్గాల సమీక్షలు మొదలుపెట్టనున్న చంద్రబాబు.. ఉదయం 11 గంటల తర్వాత జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నెల్లిమర్ల (Nelimarla) , చీపురుపల్లి (Chipurupalle) నియోజకవర్గాలలోని ముఖ్య కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లనున్నారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనా తీరును ఎండగట్టనున్నారు.

    గత నెలలలో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో బాదుడే బాదుడే కార్యక్రమం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ముగించిన చంద్రబాబు..  ఇప్పుడు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా గతంలో టీడీపీలో ఉండి తరువాత  వైసీపీలో చేరిన నేతలపై ఫోకస్ చేయనున్నారు.  వారిని తిరిగి ఆహ్వానించడంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.



    అలాగే తెలుగు దేశం పార్టీలో ఉన్న వర్గ పోరుపైనా ఫోకస్ చేస్తున్నారు.. ఇకపై కలిసి పని చేయకపోతే నష్టం తప్పదని నేతలకు స్పష్టం చేయనున్నారు. అలాగే చేరికల విషయంపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు కొందరు నేతలకు ఆయ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పి.. టికెట్లపైనా క్లారిటీ ఇస్తారనే ప్రచారం ఉంది.

    ఇదీ చదవండి : ఆదాయం.. ఆరోగ్యం.. రెండిటిపైనా ఫోకస్.. ఆంధ్రా కశ్మీర్ లో యాపిల్స్ ఎంతో ప్రత్యేకం..

    నేటి  ఉదయం 8 గంటల నుంచి నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు. జిల్లాలోని టీడీపీ బలోపేతం సహా మరికొన్నిఅంశాలపై చర్చ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. జిల్లాలోని కీలక టీడీపీ నేతలు, ఇన్చార్జ్ లతో సమావేశం కానున్నారని సమాచారం. తరువాత  11 గంటలకు భోగాపురం మండలం లోని సన్‌రే రిసార్ట్స్‌ నుంచి భోగాపురం, నాతవలస, డెంకాడ, విజయనగరం పట్టణంలోని దాసన్నపేట జంక్షన్ మీదుగా నెల్లిమర్ల మండలం రామతీర్ధం జంక్షన్ చేరుకుంటారు.

    ఇదీ చదవండి : ప్రత్యేక హోదా ఇస్తేనే.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు.. లోకేష్ కొత్త డిమాండ్.. వైసీపీ సమాధానం..!

    మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. తరువాత గంట సేపు విరామం ఉంటుంది. 3 గంటలకు నెల్లిమర్ల నుండి బయల్దేరి 3.15 గంటలకు గుర్ల మండల కేంద్రానికి చేరుకుని 3.15 నుంచి 4 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం గుర్ల బయల్గేరనున్న చంద్రబాబు.. 4.20 నిమిషాలకు గుర్ల మండలం పెనుబర్తి కూడలికి చేరుకుంటారు. 4.45 నిమిషాల వరకు అక్కడే ఉన్న తోటపల్లి కాల్వలను పరిశీలిస్తారు.  5 గంటలకు గుర్ల మండల కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడ 5.45 వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. 6 గంటలకు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 6.45 వరకు రోడ్‌షో లో ప్రసంగిస్తారు.  రాత్రి 7గంటలకు చీపురుపల్లి నుంచి బయలుదేరి 9గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

    తదుపరి వార్తలు