హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

PM Modi-Babu: మోదీతో మాటా మంతి.. చంద్రబాబు చెప్పిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని

PM Modi-Babu: మోదీతో మాటా మంతి.. చంద్రబాబు చెప్పిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని

ప్రధాని మోదీ చంద్రబాబు మాటా మంతి

ప్రధాని మోదీ చంద్రబాబు మాటా మంతి

PM Modi -Chandrababu: మళ్లీ మోదీకి దగ్గర అయినట్టే ఢిల్లీలో పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో.. టీడీపీ అధినేత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు ఆయన చెప్పిన అంశాన్నే.. ప్రధాని తన ప్రసంగంలో ప్రస్థావించడం విశేషం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

PM Modi-Chandrababu: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. ఓ జాతీయ స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా.. ప్రధాని మోదీ (Prime Minister) అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.. టీడీపీ అధినేత.. మాజీ సీఎం చంద్రబాబు.. సమావేశం ప్రారంభానికి ముందు.. ప్రత్యేకంగా మాట్లాడారు.. ప్రధానే స్వయంగా బాబును పిలిచి.. ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు కూడా.. ఇద్దరూ చాలా సరదగా మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.

తరువాత ప్రారంభమైన సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఉపన్యసించారు. చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ . భారత్ దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు చంద్రబాబు.

ఢిల్లీలో #G20 పై జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై మాట్లాడగా, చంద్రబాబు గారు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. (1/3) pic.twitter.com/oYEavGcEBo

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశంగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలం.. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలి అన్నారు. అలాగే దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు చంద్రబాబునాయుడు.

ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఆయన ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం బయలుదేరారు. అయితే చంద్రబాబు రేపు కూడా ఢిల్లీలోనే ఉండి.. కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అక్కడే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

ఇదీ చదవండి : ఉల్లితో ఆరోగ్యమే కాదు..? రైతులకు భారీ లాభాలు.. కానీ ఇలా చేస్తేనే..?

ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశం తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంద్రబాబు నాయుడు కలుసుకోవడం రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారి తీసింది. సందర్భంగా చంద్రబాబును స్వయంగా మోదీ ఆప్యాయంగా పలకరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రాజకీయాంశాలపై ఏవైనా మాట్లాడారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా మోదీ, చంద్రబాబు నాయుడుల సమావేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణమాం చోటు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Pm modi

ఉత్తమ కథలు