Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU SLAMS YS JAGAN AND YCP GOVERNMENT OVER POLAVARAM AND ATMAKUR BY ELECTION FULL DETAILS HERE PRN GNT

Chandrababu: పోలవరంపై పేలుతున్న మాటల తూటాలు.. రివర్స్ పాలనతోనే పోలవరం రివర్స్.. చంద్రబాబు ఫైర్..

జగన్ పై చంద్రబాబు ఫైర్

జగన్ పై చంద్రబాబు ఫైర్

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుల ఆలస్యమవడానికి మీరంటే మీరు కారణమంటూ రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని టిడిపి (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విమర్శించారు.

ఇంకా చదవండి ...
    పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుల ఆలస్యమవడానికి మీరంటే మీరు కారణమంటూ రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని టిడిపి (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విమర్శించారు. జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ల విధానంపై గొప్పగా చెప్పిందని.. చివరికి ఆ విధానం వల్ల ప్రాజెక్ట్ రివర్స్ అయ్యిందని విమర్శించారు. పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం చెప్పిన సూచనలను రాష్ట్రం పాటించకపోవడం వల్లనే అనర్థం జరిగిందని చంద్రబాబు అన్నారు. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు.

    ప్రభుత్వం మారిన తరువాత సరిగా ప్రాజెక్టు నిర్వాహణ చేపట్టకపోవడం, ఏజెన్సీలను మార్చడం వల్లనే నష్టం జరిగిందని అన్నారు. 2020లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం...2022 వచ్చినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని నేడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

    ఇది చదవండి: ఆ ఇడియట్ అన్యాయం చేశాడు.. టీడీపీ నేతపై దివ్యవాణి సంచలన కామెంట్స్.. పార్టీకి రాజీనామా


    మహానాడు గ్రాండ్ సక్సస్ అయ్యిందని.. దీంతో ప్రభుత్వం మళ్లీ కుట్రలు, కక్ష సాధింపులు మొదలు పెట్టిందని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో ప్రభుత్వం వేధిపుంలు మొదలుపెట్టిందని అన్నారు. మహానాడు సక్సెస్ పై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

    ఇది చదవండి: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్.. 2024 ఎన్నికలే టార్గెట్.. జగన్ వ్యూహం ఇదేనా..!


    ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. చట్టసభ సభ్యుడు చనిపోతే.. వాళ్ల కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదు అనే విధానం టిడిపి పాటిస్తుందని అన్నారు. ఈ విధానం తోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టిడిపి పోటీ పెట్ట లేదని అన్నారు. మొదటి నుంచి టిడిపి ఈ విధానాన్ని అనుసరిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీని పైనా వైసిపి నీచంగా రాజకీయ విమర్శలు, సవాళ్లు చెయ్యడానికి చంద్రబాబు తప్పుపట్టారు. సంస్కారం లేకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బద్వేల్ లో ఎందుకు పోటీ పెట్టలేదో... ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని చంద్రబాబు అన్నారు.

    ఇది చదవండి: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..


    రాజకీయాల్లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలి అని చంద్రబాబు అన్నారు. జగన్ పాలన చెయ్యలేకపోతున్నారని.. ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఒక్క నెలలో 9500 కోట్లు అప్పులుగా తెచ్చారంటే.. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చెయ్యడం పరిపాటిగా మారిందని చంద్రబాబు అన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Polavaram, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు